“జాంబిరెడ్డి” మూవీ తేజకు పెద్ద హిట్ అవ్వాలి- ప్రీ-రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ !!*

700

బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తేజ సజ్జ రీసెంట్ గా ‘ఓ బేబీ’లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా తేజ సజ్జ “జాంబిరెడ్డి” చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్ గా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ “జాంబిరెడ్డి” సినిమాని నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ కి వన్డ్రఫుల్ రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం అత్యధిక ధియేటర్స్ లలో విడుదల కానుంది. ఈ సందర్బంగా జాంబిరెడ్డి ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ జెఆర్ సి కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్యఅతిధిగా విచ్చేయగా.. ప్రముఖ దర్శకులు బాబీ, తరుణ్ భాస్కర్, బివియస్ రవి, ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, బెక్కం వేణుగోపాల్, హీరో తేజ సజ్జా, హీరోయిన్ దక్షా నగార్కార్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత రాజశేఖర్ వర్మ, తనికెళ్ళ భరణి, త్రిపురనేని చిట్టి, గెటప్ శ్రీను, హేమంత్, లహరి, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి తదితరులు పాల్గొన్నారు..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు తేజ. వాడు మా ఫ్యామిలో ఒక మెంబర్. చిరంజీవి గారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. తేజ సడెన్ గా ‘ఓ బేబీ’ లో కనిపించాడు. అందులో క్యూట్ గా, హ్యాండ్సమ్ గా వున్నాడు. సినిమా చూసి చాలా సప్రయిజ్ అయ్యాను. ఫస్ట్ టైమ్ తేజ జాంబీస్ జోనర్ మూవీని సెలెక్ట్ చేసుకొని చేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నా. హాలీవుడ్ లో జాంబీస్ వెరీ సక్సెస్ ఫుల్ జోనర్. హిందీలో ఒకటి, తమిళంలో ఒక మూవీ వచ్చాయి. అవి మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబిరెడ్డి వస్తూంది. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ వర్మ వెరీ టాలెంటెడ్, గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. డిఫరెంట్ జోనర్స్ లో కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న “జాంబిరెడ్డి” తేజకు పెద్ద హిట్ కావాలి.. అన్నారు.

చిత్ర నిర్మాత రాజ్ శేఖర్ వర్మ మాట్లాడుతూ.. ‘ పిలవగానే మా ఫంక్షన్ కి వచ్చి సపోర్ట్ చేస్తున్న వరుణ్ తేజ్ కు థాంక్స్. సినిమా తీయాలనేది నా డ్రీమ్. ఆనంద్, ప్రభ ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం. వారే ప్రశాంత్ వర్మని నాకు పరిచయం చేశారు. క్యూట్ గా యంగ్ హీరోలా వున్నాడు.. ఇతను డైరెక్టరా అనుకున్నాను. కానీ బ్యూటిఫుల్ స్టోరీ నేరేట్ చేశాడు. జాంబిరెడ్డి సినిమాని చాలా గొప్పగా తెరకెక్కించాడు. వెరీ జీనియస్ డైరెక్టర్. అలాగే ఈ సినిమాకి తేజ హీరోగానే కాకుండా పబ్లిసిటీ, ప్రమోషన్స్, అన్నీ తానే చూసుకున్నాడు. రాబిన్ ఇంక్రిడబుల్ జాబ్. ఔట్ స్టాండింగ్ రీ- రికార్డింగ్ చేసాడు. మా టీమ్ అంతా చాలా కష్టపడి వర్క్ చేశారు. అందరికీ పేరు పేరునా థాంక్స్. జాంబిరెడ్డితో నా కల నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ థాంక్స్.. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘ మా నిర్మాత రాజ్ శేఖర్ వర్మగారు నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైనా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా జాంబిరెడ్డి చిత్రాన్ని రూపొందించారు. షూటింగ్ పాండమిక్ టైంలో జరిగింది. ఆయన ఎంతో మందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. అలాంటి మంచి వ్యక్తి నాకు నిర్మాతగా దొరకడం నా అదృష్టం. అనిత్ పెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు. మ్యూజిక్ రాబిన్, ఎడిటర్ సాయి, కాస్ట్యూమ్స్ ప్రశాంతి టీమ్ అంత చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు. ముఖ్యంగా మా సిస్టర్ స్నేహ నేను గుడ్ సినిమా తీస్తే.. తను గ్రేట్ సినిమాలా చేసింది. తేజ నాకు మంచి ఫ్రెండ్. అ! సినిమా కన్నా ముందే తనతో సినిమా చేయాలి.. కుదరలేదు. జాంబిరెడ్డిలో ఫుల్ ఎనర్జిటిక్ గా చేశాడు. ఆనంది, దక్ష పెంటాస్టిక్ గా నటించారు. కొత్త జోనర్ లో వస్తున్న జాంబిరెడ్డి సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా యూనిట్ అంతా బ్లాక్ బస్టర్ సినిమా చేశాం అని చెప్తున్నారు. ముందునుండి ఈసారి గట్టిగా కొట్టాలి అని కసితో ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూశాం అని.. కొత్త అనుభూతికి లోనవుతారు.. అన్నారు.

హీరో తేజ మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాకి టాప్ టు ఎండ్ వరకు అన్నీ ప్రశాంత్ వర్మనే.. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. హీరోగా నా ఎదుగుదలకు చేయి పట్టి నడిపిస్తున్న మా నిర్మాత శేఖర్ వర్మగారి నా కృతజ్ఞతలు. ఆయనకోసం నేను ఎప్పుడూ ముందుంటాను. ఫిబ్రవరి 5న మా సినిమా విడుదలవుతుంది.. రెండున్నర గంటలు ప్రతిఒక్కర్నీ నవ్విస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. చిరంజీవి గారిని త్వరలో కలవనున్నాం. ఆయన బెస్ట్ విషెస్ అందించారు. నన్ను సపోర్టుచేస్తున్న వరుణ్ తేజ్ అన్నకు చాలా థాంక్స్.

ఇంకా ఈ కార్యక్రంలో బివి యస్ రవి, బెక్కం వేణుగోపాల్, హీరోయిన్ దక్ష, చిట్టి, గెటప్ శ్రీను మాట్లాడుతూ.. కొత్త జోనర్లో వస్తున్న జాంబిరెడ్డి చిత్రం డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది.. అవ్వాలి అని అన్నారు. అదేవిదంగా హీరోలు సందీప్ కిషన్, సుశాంత్, దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ.. జాంబిరెడ్డి ట్రైలర్ చాలా బాగుంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. ప్రశాంత్ వర్మ చాలా డిఫరెంట్ గా తీసి ఉంటాడు అని అర్థం అవుతుంది. ఈ సినిమాతో తేజ మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలి అని వీడియో బైట్స్ ద్వారా తమ సందేశాన్ని తెలిపారు.

తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కార్ జంటగా నటించిన ఈ చిత్రంలో రఘుబాబు, పృద్వి రాజ్, గెటప్ శీను, హర్షవర్ధన్, హేమంత్, కిరీటి, హరితేజ, అదుర్స్ రఘు, మహేష్ విట్ట, అన్నపూర్ణమ్మ, విజయ్ రంగరాజు, వినయ్ వర్మ, నాగ మహేష్, ప్రియ, చరణ్ దీప్, త్రిపురనేని చిట్టి నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: మార్క్ కె.రాబిన్, కెమెరా: అనిత్ మాదాడి, ఎడిటర్: సాయిబాబు తలారి, కొరియోగ్రాఫర్స్: విజయ్, యస్వంత్, ఫైట్స్: నందు, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి, కాస్ట్యూమ్స్ డిజైనర్: ప్రసన్న దంతులూరి, పీఆర్ఓ; వంశీ-శేఖర్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమచ్చ, ప్రభ చింతలపాటి, రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385