సీతారాం సిత్రాలు టైటిల్ లోగో ఆవిష్కరణ !!!

523

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. లక్ష్మణ్ , భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సీతారాం సిత్రాలు చిత్ర టైటిల్ లోగో ను ప్రముఖ సినిమాటోగ్రఫర్ , డైరెక్టర్ కె.వి.గుహన్ విడుదల చేశారు. టైటిల్ కొత్తగా ఉంది, ఫన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అందరిని అలరించాలని ఆశిస్తున్నాను అన్నారు.

కామెడీ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథ కథనాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానుందని దర్శకుడు డి.నాగ శశిధర్ రెడ్డి తెలిపారు.

“నువ్వు గెలెవనంత వరకు ఏమీ చెప్పిన అది చెత్తె
ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త
చెప్పిన అది చెరిత్రే”

నటీనటులు: లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి
లిరిక్స్: శేఖర్ రాజు విజయ భట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి.

(లక్ష్మణ్, భ్రమరాంబిక)