HomeTeluguఅందాల ‘ఓ భామ’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

అందాల ‘ఓ భామ’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

జో సినిమాతో పరిచయమై యువత హృదయాలు దోచుకున్న మాళవిక మనోజ్. ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ‌క‌థా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ గోదాల ద‌ర్శ‌కుడుగా చేస్తున్నారు.

అయితే ఈరోజు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాళవిక మనోజ్ పుట్టినరోజు కావడంతో తనకి విషెస్ చెప్తూ, చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఒక కొలనులో పింక్ కలర్ పడవ మీద తామర పువ్వుల మధ్యలో హీరోయిన్ మాళవిక మనోజ్ క్యూట్ గా నుంచున్న ఫోస్ ని రిలీజ్ చేశారు. మరో సారి ఈ అందాల భామ యువత హృదయాలను దోచుకోవడానికి తెలుగులో ‘ఓ భామ అయ్యో రామ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో సుహాస్‌, మాళ‌విక మ‌నోజ్‌, అనిత హ‌స్సా నంద‌ని, అలీ, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌, సంగీతం: ర‌థ‌న్‌, ఆర్ట్ : బ్ర‌హ్మా క‌డ‌లి, కో ప్రొడ్యూస‌ర్ ఆనంద్ గ‌డ‌గోని, ఎడిట‌ర్‌: భ‌వీన్ ఎమ్‌.షా, కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌: అశ్వ‌త్ అండ్ ప్ర‌తిభ‌, పీఆర్ ఓ : ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు, నిర్మాత‌లు: హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డ, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: రామ్ గోదాల

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES