విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత టి.గణపతి రెడ్డి, దర్శకుడు వి.జె.ఖన్నా, హీరో విజయ్ ధరణ్ దాట్ల, హీరోయిన్ సిమ్రాన్ గుప్తాతో పాటు అజయ్ ఘోష్, నాగి పాల్గొన్నారు. ఇంకా అశ్విన్ బాబు, సోహైల్, చైతన్య రావు, సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ ‘‘సాధారణంగా దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. అయితే షిప్ లేకపోతే కెప్టెన్ ఉండరు. అలాంటి షిప్ ఎవరంటే నిర్మాతే. అన్వేషి సినిమా విషయానికి వస్తే గణపతి రెడ్డిగారు షిప్ అయితే, వి.జె.ఖన్నాగారు కెప్టెన్. ఇందులో యాక్ట్ చేసిన విజయ్, సిమ్రాన్ గుప్తా సహా నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. వీరు ఈ సినిమా కోసం చేసిన జర్నీ గురించి చెబుతున్నప్పుడు మాకు మా తొలి సినిమాలో మేం పడ్డ స్ట్రగుల్స్ గుర్తొచ్చాయి. ట్రైలర్ చూశాను. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారు. నాకు కూడా ఇలాంటి జోనర్ మూవీతోనే సక్సెస్ వచ్చింది. కాబట్టి విజయ్‌కి కూడా సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ వి.జె.ఖన్నా మేకింగ్ చాలా బావుంది. చైతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. వి.జె.ఖన్నా మేకింగ్ చాలా బావుంది. నవంబర్ 17న అన్వేషి సినిమాను చూసి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. గణపతి రెడ్డిగారితో రాబోయే రోజుల్లో నేను కూడా సినిమా చేయబోతున్నాను. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. అరుణశ్రీ బ్యానర్ మేకింగ్‌లో వారి టేస్ట్ తెలుస్తుంది. హారర్ కామెడీ జోనర్‌లో రాబోతున్న అన్వేషి ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.
చిత్ర డైరెక్టర్ వి.జె.ఖన్నా మాట్లాడుతూ ‘‘నేను సినీ ఇండస్ట్రీకి వచ్చానంటే కారణం మా నాన్నగారే. ఆయన చిరంజీవికి పెద్ద ఫ్యాన్. నేనేమో పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్‌ని. మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్‌గారు ఇచ్చిన చిన్న ట్యూన్‌తో సినిమా చేయాలనే కోరిక నాలో బలంగా పెరిగిపోయింది. కార్తీక శ్రీనివాస్ చక్కగా ఎడిట్ చేసిచ్చారు. మా సినిమాటోగ్రాఫర్ కె.కె.రావుగారు బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీగారి సపోర్ట్‌కి థాంక్స్. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగి, అజయ్ ఘోష్‌గారు మంచి పాత్రల్లో నటించారు. అజయ్ ఘోష్‌గారు రోల్ ఈ సినిమాలో నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. మా నిర్మాత గణపతిరెడ్డిగారిని పరిచయం చేసిన సుబ్బరావుగారికి థాంక్స్. విజయ్ ధరణ్‌ని ఆడిషన్ చేసి ఈ సినిమాలో ఎంపిక చేశాను. సిమ్రాన్ గుప్తా బాగా నటించింది. మా కో ప్రొడ్యూసర్స్ వై.హరీష్ గారు, రాంబాబుగారు, కిరణ్‌గారు ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ఈ మూవీలో అనన్య నాగళ్ల చేసిన పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. నాకు గణపతిరెడ్డిగారు పునర్జన్మనిచ్చారు. ఆయన కమిటెడ్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బద్రిగారు కూడా మంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నవంబర్ 17న సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
హీరో విజయ్ ధరణ్ దాట్ల మాట్లాడుతూ ‘‘ఓ చిన్న పల్లెటూరు నుంచి హీరో కావాలని జర్నీ మొదలు పెడితే ఈ స్టేజ్‌కు చేరుకోవటానికి ఎన్నో అవమానాలు, బాధలను ఎదుర్కొన్నాను. ఈ రోజు గుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నా బాధ మామూలు బాధ కాదు. ఈ సినిమా రూపొందించే క్రమంలో చాలా కష్టాలు వచ్చాయి. అయితే చాలా మంది సపోర్ట్ చేయటం వల్ల పూర్తి చేసుకుంటూ వచ్చాం. మన చుట్టూ పక్కల ఉన్న వాడు కళాకారుడు అయితే తనను ఎంకరేజ్ చేయాలి. అన్వేషి గురించి చెప్పాలంటే .. మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ సమయంలో వి.జె.ఖన్నాగారు కలిశారు. ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. మా సినిమాటోగ్రాఫర్ కె.కె.రావు మంచి విజువల్స్ ఇచ్చారు. చైతన్ భరద్వాజ్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మా సినిమాకు వర్క్ చేయటం లక్కీగా భావిస్తున్నాం. సినిమా బాగోకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. సిమ్రాన్ చాలా మంచి నటి. చక్కటి సపోర్ట్‌ను అందించారు. అశ్విన్ బాబు, చైతన్య, శశికిరణ్ తిక్క, సోహైల్, సంపూర్ణేష్ బాబు గారికి థాంక్స్. నేనున్నా.. మీరు ముందుకెళ్లండి అని మమ్మల్ని ప్రోత్సహించిన నిర్మాత గణపతి రెడ్డిగారు మాకు దేవుడి కంటే ఎక్కువ. ఈ బ్యానర్ ఏ రేంజ్‌కు చేరుకుంటుందో మాకు తెలుసు. ఆయనలాంటి నిర్మాత ఇండస్ట్రీకి ఎంతో అవసరం. నవంబర్ 17న మా అన్వేషి సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘యుఎఫ్ఓ లక్ష్మణ్‌గారు ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్ అందిస్తూ వచ్చారు. ఆయన పరిచయం కావటం అదృష్టంగా భావిస్తున్నాను. హీరో విజయ్, హీరోయిన్ సిమ్రాన్, ముఖ్య పాత్రలో నటించిన అనన్య, ఇంకా అజయ్ ఘోష్, దిల్ రమేష్ థాంక్స్. చైతన్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక సైమన్ కింగ్‌గారు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే గూజ్ బమ్స్ వచ్చాయి. ఆయనకు రుణపడి ఉంటాను. వారిద్దరి మ్యూజిక్ కంపోజిషన్‌గారి వల్లే సినిమాపై నాకు ఎంతో నమ్మకం పెరిగింది. సినిమాటోగ్రాఫర్ కె.కె.రావుగారు మంచి విజువల్స్ ఇచ్చారు. మా కో ప్రొడ్యూసర్స్ చక్కటి సపోర్ట్ ఇచ్చారు. మా డైరెక్టర్ వి.జె.ఖన్నా మేకింగ్ చూస్తే ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అనరు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతీ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. నవంబర్ 17న థియేటర్స్‌లోకి వస్తున్న అన్వేషి సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాను తీయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం మరో ఎత్తు అవుతుంది. కానీ మా సినిమాకు ఎలాంటి సమస్య లేకుండా మంచి థియేటర్స్ దొరికాయి’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘హీరో విజయ్, డైరెక్టర్ ఖన్నాగారు నాపై నమ్మకంతో అన్వేషి సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. వారికి థాంక్స్. నిర్మాత గణపతి రెడ్డిగారు టీమ్‌కు మంచి సపోర్ట్‌ను అందించారు. ఎంటైర్ టీమ్ డీటెయిలింగ్‌గా మూవీని చేశాం. నా మ్యూజిక్ టీమ్, సింగర్స్, లిరిక్ రైటర్స్ మంచి సపోర్ట్ చేశారు. నవంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరోయిన్ సిమ్రాన్ గుప్తా మాట్లాడుతూ ‘‘హీరోయిన్ కావాలనే కల అన్వేషి సినిమాతో పూర్తయ్యింది. నేను సౌత్ సినిమాను ప్రేమిస్తున్నాను. ఇక్కడే సినిమాలు చేయాలనుకున్నాను. నేను సినిమా చూశాను. వారం రోజుల పాటు సరిగా నిద్ర పోలేదు. గూజ్ బమ్స్ వచ్చేశాయి. కచ్చితంగా అన్వేషి కల్ట్ సినిమాగా అందరినీ మెప్పిస్తుంది. గణపతి రెడ్డిగారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఖన్నాగారు హీరోయిన్ కావాలనే నా తపనను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. చైతన్‌గారు బ్యూటీఫుల్ మ్యూజిక్‌ను అందించారు. విజయ్‌గారు ఈ సినిమా తర్వాత పెద్ద స్టార్ అవుతారు. సినిమాటోగ్రాఫర్ కె.కె.గారు మంచి విజువల్స్ ఇచ్చారు. నవంబర్ 17న అన్వేషి మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు.
నటీనటులు:
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల, అజయ్ ఘోష్, నాగి, ప్రభు దిల్ రమేష్, చంద్ర శేఖర్ రెడ్డి, రచ్చ రవి, మిమిక్రీ సుబ్బరావు, ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ సత్య తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాత: టి.గణపతి రెడ్డి
కో ప్రొడ్యూసర్స్: హరీష్ రాజు, శివన్ కుమార్ కందుల, గొల్ల వెంకట రాంబాబు, జాన్ బోయలపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దుర్గేష్.ఎ
రచన, దర్శకత్వం: వి.జె.ఖన్నా
సినిమాటోగ్రఫీ: కె.కె.రావు
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
లిరిక్స్: చైతన్య ప్రసాద్, చైతన్య వర్మ, శుభం విశ్వనాథ్
స్టంట్స్: జాషువా
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, విద్యాసాగర్ రాజు
పి.ఆర్.ఒ: వంశీ కాకా