‘వాంటెడ్ పండుగాడ్’ ఎంజాయ్ చేస్తారు : ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు

49

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ బిగ్ టికెట్ లాంఛ్ చేశారు …

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశమంతా ఆనందంగా ఉంది. సినిమాల‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చింది. సీతారామం, బింబిసార‌, కార్తికేయ 2 వంటి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. రేపు థియేట‌ర్స్‌లో మ‌న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ రిలీజ్ అవుతుంది. నా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్, డైరెక్టర్ శ్రీధర్ సీపాన సహా ప్రతి ఒక టెక్నీషియన్ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఆర్టిస్టులు ఎంతగానో కో ఆపరేట్ చేశారు. ఎంట‌ర్‌టైనింగ్ మూవీగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఆగస్ట్ 19న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.