విరాటపర్వం’ పవర్ బ్లాస్ట్ లా వుంటుంది : నవీన్ చంద్ర ఇంటర్వ్యూ

413

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి.

విరాటపర్వంలో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?

ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కథలో చిన్న మార్పు తేవడమో, ట్విస్ట్ ఇవ్వడమో లాంటివే చేశాను. కానీ విరాటపర్వం లో మాత్రం పూర్తికథనే తలకిందులు చేసే పాత్రలో కనిపిస్తా. ఇందులో నా పాత్ర పేరు రఘన్న. సినియర్ ఉద్యమకారుడిగా కనిపిస్తా. ఉద్యమం తప్ప దేన్నీ లెక్కచేయను. ఎలాంటి ఎమోషన్ కి లొంగను. ఈ కారణంతోనే గ్రూప్ లో సీనియర్ గా గుర్తింపు దక్కాల్సిన నా పాత్ర జూనియర్ ఉద్యమ కారుడిగా వుంటుంది. ఆ ఈర్ష్య కూడా నా పాత్రలో కనిపిస్తుంది. అలాగే ప్రియమణి గారు భారతక్క పాత్రలో కనిపిస్తారు. మా రెండు పాత్రలు రవన్న పాత్ర పోషిస్తున్న రానాగారికి దగ్గరగా వుంటాయి. మాకు అన్నిటికంటే ఉద్యమం, విధానాలే ముఖ్యం. సాయి పల్లవి గారు వెన్నెల పాత్రలో కనిపిస్తారు. ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ విరాటపర్వంలో వుంది. ఇది వండర్ ఫుల్ మూవీ. దర్శకుడు వేణు ఉడుగుల గారు అద్భుతంగా రాశారు, తీశారు. విరాటపర్వం కోసం చాలా కష్టపడ్డాం. కానీ ఇష్టంగా చేశాం. కొత్తకథని బలమైన పాత్రలతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు వేణు గారు. ఇందులో నేనూ భాగం కావడం ఆనందంగా వుంది. ఇందులో చాలా మంచి పాత్ర నాకు దక్కింది. దాదాపు 35నిమిషాల పాటు నా పాత్ర ఒక బ్లాస్ట్ పేలుతుంది. ప్రతి ఒక్కరికి ప్రశ్నలు సంధిస్తుంది. ఇంత పవర్ ఫుల్ పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా వుంది.

మొదటిసారి తెలంగాణ యాసలో చేయడం ఎలా అనిపించింది ?

బళ్ళారి బోర్డర్ కాబట్టి ఆంధ్ర రాయలసీమ ప్రభావం నాపై వుంది. కానీ మొదటిసారి నాతో తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు దర్శకుడు వేణు. డైలాగ్స్ లో కూడా కవిత్వం వినిపిస్తుంది. చాలా డీప్ మీనింగ్ వున్న సంభాషణలు ఇందులో వుంటాయి.ఇది నిజంగా జరిగిన కథ , దర్శకుడు వేణు గారికి తెలిసిన కథ, ఆయన ఎక్స్ పీరియన్స్ చేసిన కథ .. అలాంటి కథని తెరపైకి తీసుకురావడంలో అందులో నేను కీలక పాత్ర పోషించడం, నటనకి ఆస్కారం వుండే పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.

రానాతో పని చేయడం ఎలా అనిపించింది ?

రానా చూడటానికి ఆజానుబాహుడులా వుంటారు. తెలివిగా మాట్లాడతారు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన చిన్న పిల్లల మనస్తత్వం, అందరితో చాలా సరదాగా వుంటారు. ఆయన ప్రతి క్షణం సినిమా గురించే ఆలోచిస్తారు. ప్రతి ఇండస్ట్రీలో జరుగుతున్న సినిమాల అప్డేట్స్ ఆయన దగ్గర వుంటాయి. రానా గారు బిగ్ ఇన్ ఫర్మేషన్ బాక్స్.

అడవిలో షూటింగ్ చేశారు కదా .. నిర్మాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

గన్స్ పట్టుకోవడం దగ్గర నుండి బాంబ్ బ్లాస్ట్, అడవిలో ప్రయాణం, కొండలు ఎక్కడం .. ఇలా చాలా ట్రైనింగ్ వుంది ఈ సినిమాలో. అయితే మాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నిర్మాతలు అన్నీ దగ్గరుండి సమకూర్చారు. లాక్ డౌన్ టైంలో సానిటైజేషన్ తో పాటు టీంతో ఎప్పుడూ ఒక అంబులెన్స్ వుండేది. అడవిలో నటీనటులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా లొకేషన్ లో ముందే ప్రొడక్షన్ టీం రెక్కీ నిర్వహించి అన్ని వసతులు కల్పించేవారు.

సాయిపల్లవి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

సాయి పల్లవిగారితో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. వెన్నెల పాత్ర నుండి ఆమె బయటికి రాలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. వెన్నెల పాత్ర చుట్టే విరాటపర్వం కథ తిరుగుతుంది. వెన్నెల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

అరవింద సమేత తర్వాత నెగిటివ్ పాత్రలు ఎక్కువ వస్తున్నాయా ?

లేదండీ. చాలా భిన్నమైన పాత్రలు చేస్తున్నా. రామ్ చరణ్ గారి సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నా. కథలో ప్రాముఖ్యత వున్న పాత్రలని ఎంపిక చేసుకొని చేస్తున్నా. ఇమేజ్ కోసం ఏమీ చేయడం లేదు . మంచి కథ, సినిమాలో వుంటే చాలనే కోరిక.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

నాలుగు సినిమాలు రిలీజ్ కి వున్నాయి. అమెజాన్ ఒరిజినల్ కి ఒక సినిమా, అమ్ము , పరంపర సీజన్2, యువీ కాన్సెప్ట్స్ లో హీరోగా ఒక సినిమా చేశాను. తమిళ్, తెలుగు బైలింగ్వల్ ఒకటి అలాగే రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది. అలాగే బాలకృష్ణ – గోపిచంద్ మలినేని గారి సినిమా చేస్తున్నా. బాలకృష్ణ గారితో పని చేయడం మాత్రం అవుట్ అఫ్ ది వరల్డ్ ఎక్స్ పీరియన్స్. ఆయన చూస్తూనే ప్రేమ వచ్చేస్తుంది. ముద్దు పెట్టాలనిపిస్తుంది. బాలకృష్ణ గారు అద్భుతమైననటులు, గొప్ప వ్యక్తి. బాలకృష్ణ గారి సినిమాలో కూడా నాది కీలక పాత్రే.

ఇలా పాత్రలు చేయడం కష్టం అనిపించదా ?

లేదండీ. హీరోగా చేయడం అనేది సెఫరేటు. నాలుగు నెలలు ఒకే కథపై వుంటాం. దానికి వచ్చే పేరు, రేమ్యునిరేషన్ వేరుగా వుంటాయి. కానీ పాత్రలు చేయడంలో కూడా నటుడిగా నాకు తృప్తిని ఇస్తుంది. పాత్రకి చాలా తక్కువ నిడివి వుంటుంది. అందులోనే నిరూపించుకోవాలి. ఈ ఛాలెంజ్ ని తీసుకోవడం నటుడిగా నాకో తృప్తి వుంటుంది.

ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా ? డేట్స్ క్లాష్ వుండదా ?

లేదండి. నిర్మాతలు, దర్శకుడు చాలా సపోర్టివ్ గా వుంటున్నారు. ఒకవేళ క్లాష్ వచ్చినా సర్దుబాటు చేసుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో మీరు చేసిన మీకు ఇష్టమైన సినిమాలు ?

దర్శకుడు శ్రీకాంత్ నగూతి, కార్తిక్ సుబ్బరాజులతో చేసిన సినిమాలు చాలా విలక్షణంగా ఉండబోతున్నాయి. ఆ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

 

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385