‘విక్రమ్’లో గొప్ప మ్యాజిక్ వుంది: కమల్ హాసన్ ఇంటర్వ్యూ

424

”విక్రమ్ సినిమా లో గ్రేట్ మ్యాజిక్ వుంది. హీరో నితిన్ గారి ఫాదర్ సుధాకర్ రెడ్డి బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400+ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్.

కమల్ హాసన్ కథానాయకుడి గా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్ 3న ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది. ఈ సందర్భంగా మీడియాతో ‘విక్రమ్’ చిత్రం విశేషాలు పంచుకున్నారు కమల్ హాసన్. ఆయన చెప్పిన విక్రమ్ విశేషాలివి.

రాజకీయాలు గురించి కూడా మాట్లాడుతుంటారా ?
చాలా తక్కువ. మా ఇద్దరిది భిన్నమైన ఫిలాసఫీ. మేము ఎప్పుడూ పొలిటికల్ డిబేట్స్ జోలికి వెళ్ళం. మా స్నేహానికి గౌరవిస్తాం.

ఇంతకీ ఇందులో విక్రమ్ ఎవరు ?
ఇది ముందే చెప్పేస్తే ఇంక మ్యాజిక్ పోతుంది. మెజీషియన్ తన హార్ట్ నుండి రాబిట్ తీస్తాడు. ఇది అసంభవమని మనకి తెలుసు. కానీ అది ఎలా తీశాడో మెజీషియన్ చెప్పడు. అదే మ్యాజిక్ (నవ్వుతూ). విక్రమ్ ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (నవ్వుతూ)

హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేస్తున్నారు కదా ?
హీరో నితిన్, వారి నాన్న గారు సుధాకర్ రెడ్డి గారికి సినిమాపై ప్యాషన్ వుంది. వారి నిర్మాణంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. వారికి సినిమాల పట్ల మంచి అభిరుచి వుంది. ‘విక్రమ్’ ని దాదాపు 400పైగా థియేటర్స్ లో భారీ విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి స్పెషల్ థ్యాంక్స్.

విక్రమ్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లాంటి స్టార్లు కూడా వున్నారు కదా.. వాళ్ళ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ?

నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది. నా సినిమాల విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్ ని. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. కానీ లోపల నేనెప్పుడూ ఒక కళాకారుడినే. కళాకారుడికి నాటకం ముఖ్యం. నేను స్వయంగా రాసిన చిత్రాలలో కూడా పవర్ ఫుల్ పాత్రలు రాశాను. నా చిత్రాలతో చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు. హీరోలయ్యారు. పోతురాజు సినిమాలో పశుపతి, అన్బే శివంలో మాధవన్ పాత్రలు ఎంతో బలమైనవి.

సూర్య పాత్ర ఎలా ఉండబోతుంది ?
సూర్య స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపిస్తారు. నిజానికి హీరో ని బుక్ చేసేటప్పుడు నేరుగా కలసి బోకే ఇచ్చి బుక్ చేస్తారు. నేను కూడా సూర్యకి ఒక బోకే ఇద్దామని అనుకున్నా. విక్రమ్ స్పెషల్ రోల్ గురించి కలసి మాట్లాడదామని ఫోన్ చేశా. కానీ ఫోన్ కాల్ లోనే అంతా అయిపొయింది. ”నేను చేస్తా అన్నయ్యా” అన్నారు. నేను వెళ్ళేటప్పటికి మొత్తం అయిపొయింది. బోకే ఇవ్వడం ఇంక కుదరలేదు(నవ్వుతూ). షేక్ హ్యాండ్ తో సరిపెట్టుకున్నాం.

తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేయబోతున్నారు ?
నాకూ చేయాలనే వుంది. నేరుగా తెలుగులో సినిమా చేసి చాలా కాలమైయింది. దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మీరు కూడా తెలుగు, తమిళ అని కాకుండా ఇండియన్ సినిమా అనడానికే ఇష్టపడతారు కదా ?
అవునండీ. ప్రస్తుతం హైదరాబాద్ నేషనల్ ఫిలిం మేకింగ్ హబ్ గా వుంది. ముందు చెన్నై వుండేది. నాగిరెడ్డి గారి లాంటి దర్శకులు మాయాబజార్ లాంటి చిత్రాలని తెలుగు తమిళ్ లో తీసేవారు. రాముడు భీముడు తెలుగు , ఎంగవిట్టి పిళ్ళై తమిళ్ , రామ్ ఆర్ శ్యామ్ హిందీ .. ఈ చిత్రాలన్నీ ఒకే నిర్మాణ సంస్థ తీసింది. చంద్రలేఖ మొదటి పాన్ ఇండియా సినిమా. అలాగే ఇప్పుడు బాహుబలి. పాన్ ఇండియా సినిమా అనేది ఎప్పటి నుండో వుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు లాంగ్వేజ్ సినిమాలు తీయలేదు కానీ సౌత్ నుండి అన్ని భాషల చిత్రాలు తెరకెక్కాయి.రామానాయడు గారు అన్ని భాషల చిత్రాలు తీశారు. ఆయన నేషనల్ ప్రోడ్యుసర్, పాన్ ఇండియా ప్రోడ్యుసర్.

అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పండి ?
అనిరుద్ పెద్ద కళాకారుల కుటుంబం నుండి వచ్చారు. ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతమైన కళాకారుడు. చాలా గొప్ప సినిమాలకు పని చేశారు. అనిరుద్ మంచి మ్యూజిక్ ఇవ్వడంలో నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంత గొప్ప కళాకారుల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా మంచి సంగీతం అందించాలి.

విక్రమ్ లో పాట కూడా పాడారు ?
కే విశ్వనాద్ గారి నుండి నాకు ఒకటే అలవాటు. సినిమా కోసం ఏదైనా చేయమంటే తప్పకుండా చేస్తాను. విక్రమ్ లో పాట పాడమని అడిగారు. పాడాను.

విశ్వనాద్ గారిని కలుస్తుంటారా ?
చెన్నైలో ఉండేటప్పుడు వారానికి, నెలకి ఒకసారైన కలిసేవాడిని. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఫోన్ లో తరుచూ మాట్లాడుతూవుంటాం.

నటన, నిర్మాణం, రాజకీయం.. వీటిని ఎలా బ్యాలన్స్ చేస్తున్నారు ?
సౌత్ లో ఇది కొత్త కాదు. సౌత్ లో సినిమా రాజకీయం విడదీయరాని ఒక కలయిక. నా ముందు తరం నటులు, నిర్మాతలు, పెద్దవాళ్ళు అందరూ చేసిందే నేను చేస్తున్నా.

భారతీయుడు 2 దర్శకత్వం మీరే చేస్తున్నారా ?
నా నుండి ప్రేక్షకులు ఏడాది కి రెండు సినిమాలైనా కోరుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే ఇది సాధ్యపడదు. అందుకే దర్శకత్వం వేరే వాళ్లకు అప్పగించి నటనపై ద్రుష్టిపెట్టాలని భావిస్తున్నా.

భారతీయుడు 2ఈ ఏడాది పూర్తవుతుందా ?
పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాం.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385