రాజేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై మాధురి, పూజిత సమర్పణలో కార్తికేయ, అఖిల నాయర్ హీరో హీరోయిన్లుగా ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ ” వాడు ఎవడు ” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ … టీజర్ చూసాను బాగుంది, ఇలాంటి యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని, ఇందులో నటించిన నటీనటులకు , సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని ఈ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు.
కథ,మాటలు,స్రీన్ ప్లే రాజేశ్వరి పాణిగ్రహి మాట్లాడుతూ … సమాజంలో జరుగుతున్న కొన్ని అసాంఘిక శక్తులను మహిళలు ఎదుర్కోలేక వాళ్ళ అందమైన జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తున్నాయి వైజాగ్ లో జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనల ను తీసుకోని దాని ఆధారంగా తీసిన సినిమా ఇది అని అన్నారు . దర్శక నిర్మాత మాట్లాడుతూ … ఈ చిత్రంలో మూడు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి అని తెలియ జేశారు. ప్రమోద్ కుమార్ సంగీత దర్శకత్వంలోని మూడు పాటలు వైజాగ్ పరిసర ప్రాంతాలలోని, ఒరిస్సా అందమైన లొకేషన్లలో చిత్రీకరించామని, ఈ మూవీ ద్వారా సమాజానికి ఒక మంచి మెసెజ్ ఇస్తున్నామన్నారు. ఇంకా ఈ చిత్రంలో శివ్ యువన్ ,ఆంజనేయులు , రాజ్ కుమార్ , బాబు దేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ,మాటలు,స్రీన్ ప్లే : రాజేశ్వరి పాణిగ్రహి ,కెమెరా : విజయ్ గండ్రకోటి , సంగీతం : ప్రమోద్ కుమార్ ,బ్యాగ్రౌండ్ మ్యూజిక్ :రాజేష్ ,ఎడిటర్ : సాయి ఆకుల,నరేష్ , ఫైట్స్ : రాము , నిర్మాత, దర్శకత్వం : ఎన్.శ్రీనివాసరావు