ఉపేంద్ర ‘కబ్జా’ ఇది మన దేశంలోనే 7 వివిధ భాషల్లో విడుదల కాబోతుంది.

748

సంక్రాంతి సందర్భంగా ఒక పెద్ద ప్రకటన ఉంది అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్ లో, ‘U + ?’ అని రాసి, ఎవరు జాయిన్ కాబోతున్నారో కనుగొనండి అని ఉంది. అందులో ఉన్న ‘U’, చిత్ర కథానాయకుడు ఉపేంద్ర అనేది స్పష్టంగా తెలియగా, సినిమాలో కథానాయిక ఎవరు అనేది అధికారంగా ప్రకటన ఎక్కడా చేయకపోవడంతో, అందరూ చిత్ర కథానాయికని ప్రకటించబోతున్నారు అని అనుకున్నారు.

అయితే ఈరోజు వదిలిన అప్డేట్ పోస్టర్ లో షోలే, కూం

డుకిలి, సత్యం శివమ్, గాంధాడగుడి, సిపాయి, దళపతి, బిల్లా-రంగా, లవ కుశ, గూండే, అయ్యప్పనుమ్ కోషూయుమ్, విక్రమ వేద మరియు దేవదాస్ వంటి వివిధ భాషల నుండి వివిధమైన మల్టీస్టారర్ చిత్రాల పోస్టర్స్ ను కలగలిపి ఒక అధికార పోస్టర్ ను విడుదల చేసారు.

ఇది చూసిన తరువాత, ఆ ‘U + ?’ లో ఆ ‘?’ అనేది ఇంకొక స్టార్ హీరో అయ్యి ఉంటారని కనిపిస్తుంది. అయితే అదే నిజం అయితే, కబ్జా సినిమా పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం అనే చెప్పొచ్చు. ఏది ఏమైనా, అసలు ఆ ‘?’ ఏంటి అనేది తెలియాలంటే, జనవరి 14వ తేదీ వరకు ఆగక తప్పదు కదా.

ఆర్ట్ : శివ్ కుమార్

ఎడిటర్ : మహేష్ రెడ్డి

సినిమాటోగ్రఫీ : ఎ.జె.షెట్టి

మ్యూజిక్ : రవి. బస్రూర్

సమర్పణ : లాంకో శ్రీధర్

నిర్మాణం : శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్

నిర్మాతలు : ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా

రచన – దర్శకత్వం : ఆర్. చంద్రు