HomeCeleb Interviewsప‌నిచేయ్ ఫ‌లితం ఆశించ‌కు అనే సూత్రాన్ని ఫాలో అవుతున్న - యంగ్ హీరో అభిరామ్ వ‌ర్మ‌

ప‌నిచేయ్ ఫ‌లితం ఆశించ‌కు అనే సూత్రాన్ని ఫాలో అవుతున్న – యంగ్ హీరో అభిరామ్ వ‌ర్మ‌

హోరాహోరి, రాహు వంటి ఇంట్రెస్టింగ్ సినిమాల‌తో తెలుగు చిత్ర‌సీమ‌కు హీరోగా ప‌రిచ‌మైయ్యారు అభిరామ్ వ‌ర్మ. ఫిబ్ర‌వ‌రి 3న ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిరామ్ వ‌ర్మ గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు. అమెరికాలోని ప్ర‌ముఖ బిజినెస్ స్కూల్ లో ఎమ్ బీ ఏ తో పాటు సినిమాలు మీద మ‌క్కువ‌తో థియేట‌ర్ ఆర్ట్స్ లో కూడా శిక్ష‌ణ తీసుకున్నారు. అక్క‌డే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా న‌టించారు. ఆ త‌రువాత ఇండియాకు వ‌చ్చేసిన‌ అభిరామ్ తెలుగు సినిమాల్లో అవ‌కాశాలు కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాద‌ర్ లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌న టాలెంట్ తో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ‌గారు తెర‌కెక్కించిన హోరా హోరి సినిమాలో సెకండ్ హీరోగా న‌టించే అవ‌కాశాన్ని అందుకుని తెలుగు ప్రేక్ష‌క‌లు ముంద‌కు వ‌చ్చారు. ఆ త‌రువాత ప‌లు ర‌కాల ఇంటర్నేష‌నల్ ఈవెంట్స్ లో మోడ‌ల్ గా పాల్గొని ఎన్నో అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు.

2013 మిస్టర్ ఆంధ్ర‌ప‌ద్రేశ్ టైటిల్ ని కూడా అభిరామ్ గెలుచుకున్నారు. ఇక ఇటీవ‌లే విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న రాహు అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిరామ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే అభిరామ్ కీల‌క పాత్ర పోషించిన ‘ఏకం’ అనే సినిమా విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రాన్ని ప‌లు ఇంటర్నేష‌నల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో స్క్రీనింగ్ చేయ‌గా ఎంద‌రో సినీ ప్ర‌ముఖ‌ల ప్రశంస‌లు ద‌క్కాయి. ప్ర‌స్తుతం అభిరామ్ మ‌రో మూడు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈరోజు అభిరామ్ న‌టించిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ‘నీతో’ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లై సోష‌ల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకోవ‌డం విశేషం. ‌‌గ‌త అయిదేళ్లుగా తెలుగు చిత్ర సీమ‌లో మంచి పేరు తెచ్చుకోవాల‌ని, ప్రేక్ష‌కుల్ని త‌న న‌ట‌న‌తో అల‌రించాల‌ని ఇష్టంతో క‌ష్ట‌ప‌డుతున్నాని అన్నారు అభిరామ్ వ‌ర్మ‌.

అభిరామ్ వ‌ర్మ‌కు ఇన్స్పీరేష‌న్ – యూనీవ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి
డ్రీమ్ రోల్ – ఎప్ప‌టికైనా ట్రాన్స్ జెండ‌ర్ గా న‌టించాల‌ని కోరిక‌
రెగ్యూల‌ర్ హాబీ – వ‌ర్క్ అవుట్స్, ఫిట్ నెస్ మెయింటెనెన్స్
న‌మ్మే సూత్రం – ప‌ని చేయ్ ఫ‌లితం ఆశించ‌కు

Eluru Sreenu
P.R.O

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES