క్రేజీ అంకుల్స్ సినిమా నిలిపివేయాలి….

376


తెలంగాణ మహిళా హక్కుల వేదిక డిమాండ్…..
అధ్యక్షురాలు రేఖ
కార్యదర్శి…బి రత్న

….. మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదల ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ,రత్నాలు డిమాండ్ చేశారు,ఈ మేరకు బుధవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాజా గా విడుదల కి సిద్దనగా ఉన్న క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు,మహిళ లను ఆట వస్తువు గా చూపిస్తూ,అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపిందించడం సరికాదు అన్నారు,కేవలం ట్రైలర్ లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు,గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని,కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతి ని కించపర్చడం అన్యాయమన్నారు,వెంటనే సినీ నిర్మాత,దర్శకులు, నటీనటులు యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదల ను నిపివేయాల్లి అని హెచ్చరించారు,లేకుంటే యావత్ తెలుగు రాష్ట్రాల మహిళ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు