*‘తెలంగాణ దేవుడు’ : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ*

899

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు.1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా (నూతన పరిచయం), హీరోయిన్ సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం ఈ చిత్రంలో నటించారు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ హోం శాఖా మంత్రి వర్యులు మొహమ్మద్ అలీ, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్.. చిత్ర ట్రైలర్స్‌ను విడుదల చేశారు. చిత్ర నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రంలోని మొదటి పాట ‘వాడెవడు వీడెవడు’ సాంగ్‌ను విడుదల చేశారు. అప్పాజి రెండవ పాటను విడుదల చేశారు. ‘జై తెలంగాణ’ అంటూ సాగే మూడవ పాటను ప్రభాకర్ విడుదల చేశారు. ‘తెలంగాణ అమరులకు వందనం’ అంటూ సాగే నాలుగవ పాటను ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విడుదల చేశారు.

కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ టైటిలే కరెక్ట్‌: తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ అనంతరం తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అంటే దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చేస్తారనే డౌట్ ఉండేది. . తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే సినిమా ఫంక్షన్‌కు మమ్మల్ని ఆహ్వానించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..’’ అని అన్నారు.

కేసీఆర్ నిజంగా ‘తెలంగాణ దేవుడే’: తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్
ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడి తెలంగాణను సాధించుకున్నాము. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆ నాటి ఉద్యమం గుర్తుకొస్తుంది. . నా మిత్రుడు హీరో శ్రీకాంత్ మా నాయకుడు కేసీఆర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. వారికి మరియు దర్శకనిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పక నచ్చుతుంది’’ అన్నారు.

తెలంగాణ దేవుడు’ టైటిల్ శుభపరిణామం: ఆర్. నారాయణమూర్తి
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో దాసరిగారి శిష్యులు ఎంతో మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దర్శకులై ఇప్పటికీ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. దాసరిగారి శిష్యుల దగ్గర శిష్యరికం చేసిన హరీష్ కూడా వారిలాగే ఈ సినిమాతో పెద్ద దర్శకుడవ్వాలి. కేసీఆర్ బయోపిక్ పాత్రలో శ్రీకాంత్ అద్బుతంగా నటించాడు. ఈ చిత్రానికి ఎంతో మంది పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి వారు చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు హరీష్ ‘తెలంగాణ దేవుడు’ టైటిల్ పెట్టడం చాలా శుభపరిణామం. ఈ సినిమా గొప్ప విజయం సాధించి చిత్రయూనిట్‌కు మంచిపేరు రావాలి..’’ అని అన్నారు.

నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం కష్టపడి ప్రత్యేక తెలంగాణను సాధించిన కె.సి.ఆర్ గారి బయోపిక్‌ను తీసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను..’’ అన్నారు.

దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది..’’ అన్నారు.

సంగీత దర్శకుడు నందన్ బొబ్బిలి మాట్లాడుతూ.. ‘‘ఇంత గొప్ప సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాంగ్స్ ఇంత బాగా రావడానికి టీం అందరి సహకారం ఎంతో ఉంది. శ్రీకాంత్‌గారు, దర్శకనిర్మాతలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నాకీ అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అని అన్నారు.

హీరో జిషాన్ ఉస్మాన్(తొలి పరిచయం) మాట్లాడుతూ.. గొప్పచరిత్ర కలిగిన ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

మాక్స్‌ల్యాబ్ సీఈవో మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంతో నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారి అబ్బాయి జిషాన్ ఉస్మాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాము. కొత్తవాడైనా అద్భుతంగా నటించాడు. అందరి సహకారంతో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23 విడుదల చేస్తున్నాము. ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అన్నారు

లైన్ ప్రొడ్యూసర్ మెహమూద్ ఖాన్ మాట్లాడుతూ.. మేము అనుకున్న దానికంటే చిత్రం బాగా వచ్చింది. ఇలాంటి చరిత్ర కలిగిన సినిమా తీసిననందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు

కేసీఆర్‌గారి పాత్రలో అనగానే షాకయ్యా: హీరో శ్రీకాంత్
కేసీఆర్ పాత్రలో నటించిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘పెద్దలు మొహమ్మద్ అలీగారికి, నా ఆప్తులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఆర్. నారాయణమూర్తిగారికి.. మమ్మల్ని, మా సినిమాను బ్లేస్ చేయడానికి వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. దర్శకుడు హరీష్ నన్ను కలిసి కేసీఆర్‌గారి బయోపిక్ సినిమా చేస్తున్నానని చెప్పి, ఆయన పాత్రలో నువ్వు నటించాలని చెప్పినపుడు షాక్ అయ్యాను. నేను ఆయన పాత్రలో నటించగలనా? లేదా? ఆయన పాత్రకు నేను సూట్ అవుతానా? అనే ఆలోచనతో కొంత టైమ్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందా అని డిస్కషన్ చేసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. . 23న విడుదల అవుతున్న ఈ సినిమా చూడడానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇలాంటి మంచి చిత్రం కోసం హాట్ ఫుల్‌గా పనిచేశాము. రియలిస్టిక్‌గా నిర్మించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు

ఫ్రెండ్లీ హీరో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన.

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
మూల కథ, నిర్మాత: మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మెహమూద్ ఖాన్
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌
పీఆర్వో: బి.ఎస్‌. వీరబాబు