విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్, అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడిందని చిత్ర దర్శకనిర్మాత శైలేష్ తివారి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బాలమిత్ర చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఉంటుంది. యాక్షన్ కింగ్ అర్జున్‌గారు విడుదల చేసిన చిత్ర ట్రైలర్‌కి, అలాగే ‘వెళ్లిపోమాకే’ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా కూడా కంటెంట్, టేకింగ్ పరంగా పెద్ద సినిమాలకు పోటాపోటీకి ఉంటుందని చెప్పగలను. ఫిబ్రవరి 26న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమా నిర్మాణంలో నాకు సహకరించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు..’’ అని తెలిపారు.
రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు:
సంగీతం: జయవర్ధన్,
సినిమాటోగ్రఫీ: రజిని,
ఎడిటర్: రవితేజ,
ఫైట్స్: వెంకట్ మాస్టర్,
కొరియోగ్రఫీ: విగ్నేష్ శుక్లా,
ఆర్ట్: భీమేష్,
పీఆర్వో: బి.ఎస్. వీరబాబు,
నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,
కథ, దర్శకత్వం: శైలేష్ తివారి.
#Balamithra in cinemas from Feb 26th, 2021.
#BalamithraMovie
#Balamitra
director #ShaileshTiwari film
#BoddulaLaxman
@veerababupro
—
Veerababu PRO
9396410101