సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొన్న ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో… చిత్ర దర్శకుడు పరశురాం మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న సర్కారు వారి పాట విశేషాలు…
సర్కారు వారి పాట ఐడియా ఎప్పుడు వచ్చింది ?
గీత గోవిందం ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే సర్కారు వారి పాట ఐడియా వచ్చింది. గీత గోవిందం విడుదలైన తర్వాత మహేష్ బాబు గారిని దృష్టి లో పెట్టుకొని వర్క్ చేశాను
ఈ మధ్య కాలంలో మహేష్ బాబు గారు డిఫరెంట్ జోన్ లో వున్నారు. మీరు ఆయన్ని వేరే జోన్ లోకి తీసుకొచ్చి పెట్టారు. క్యారెక్టర్ ఐడియాని ఎలా అనుకున్నారు ?
ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి మెయిన్ రీజన్.. సర్కారు వారి పాట కథ ఎంత నచ్చిందో క్యారెక్టర్ డిజైన్ కూడా మహేష్ గారికి అంత నచ్చింది.
ట్రైలర్ చూస్తుంటే పూర్తి కమర్షియల్ సినిమా అనిపిస్తుంది ?
అవును,.. సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్. మహేష్ బాబు గారి లుక్స్, ప్రజంటేషన్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. గీత గోవిందం లాంటి హిట్ వున్నా సరే ఒక మీడియం రేంజ్ దర్శకుడికి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ ఎలా ఇచ్చారని కొందరిలో ఓ ప్రశ్న వుండొచ్చు కానీ సర్కారు వారి పాట చూసిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీలౌతారు.
ట్రైలర్ లో డైలాగులు భలే పేలాయి.. అప్పుని ఆడపిల్లతో పోల్చడం, విలన్ దీనికి పూర్తి భిన్నమైన మాట చెప్పడం గురించి ?
అసలు కథ అదే. రెండు డిఫరెంట్ మైండ్ సెట్లు మధ్య జరిగే కథ.
సర్కారు వారి పాట లో మహేష్ బాబు బ్యాంక్ ఎంప్లాయా ? విజయమాల్య కథకి లింక్ వుంటుందా?
కాదు. ఇందులో బ్యాంక్ టాపిక్ వుంటుంది కానీ బ్యాంకు ఉద్యోగి కాదు. అలాగే ఈ కథలో ఒక వ్యక్తి గురించి కానీ వ్యవస్థని ప్రశ్నించడం కానీ వుండదు. మంచి ఉద్దేశంతో రాసుకున్న కథ. సరదా ఉంటూ చెప్పాల్సింది బలంగా చెప్పే కథ.
మహేశ్ బాబు గారు చిన్నవారి నుంచి పెద్దవారి దాక అన్ని వర్గాల ప్రేక్షకుల గురించి ఆలోచిస్తారు? కానీ ఇందులో కొన్ని నాటు డైలాగులు కూడా చెప్పించారు?
మహేష్ బాబు గారికి సర్కారు వారి పాట లో క్యారెక్టర్ చాలా నచ్చింది. కథలో క్యారెక్టర్ బిహేవియర్ అలా వుంటుంది.
లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది ?
అద్భుతంగా వుంటుంది. లవ్లీ, లైవ్లీ గా వుంటుంది. కీర్తి సురేష్ ది ఇందులో బలమైన పాత్ర. కథలో చాలా కీలకం.
కీర్తి సురేష్ ఇప్పుడు నటనకు ప్రాధాన్యం వుండే పాత్రలు చేస్తున్నారు కదా .. సర్కారు వారి పాటలో పెట్టుకోవడానికి గల కారణం ?
లాక్ డౌన్ కి ముందే ఈ కథ ఫైనల్ అయింది. అప్పుడు హీరోయిన్ పాత్రకి కీర్తి సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. సినిమా చూసిన తర్వాత హీరోయిన్ గా కీర్తిని ఎందుకు పెట్టుకున్నామో అందరికీ అర్ధమౌతుంది. తన లుక్స్ అద్భుతంగా వుంటాయి. మహేష్ బాబు గారిని చాలా కొత్తగా అద్భుతంగా చూపించారని ట్రైలర్ చూసి ఎలా మాట్లాడుకుంటున్నారో సినిమా చూసిన తర్వాత్ కీర్తి సురేష్ పాత్రకు కూడా అంత మంచి పేరొస్తుంది.
సముద్రఖని గారి పాత్ర కోసం ?
సముద్రఖని గారి పాత్ర ఫెంటాస్టిక్ గా వుంటుంది. అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో ఆయన పాత్ర ఒక అసెట్ గా వుండబోతుంది.
పాత్రలు కూడా యునిక్ గా చూపించినట్లు వున్నారు ? ఏదైనా ప్యాట్రన్ ఫాలో అయ్యారా ?
ఒక ప్యాట్రన్ ఫాలో అవ్వడం వుండదు. నా గత సినిమాలు చూసుకున్న అవసరమైన చోటే పాట వుంటుంది. ట్యూన్, సాహిత్యం పై కూడా చాలా పర్టిక్యులర్ గా వుంటాను. సర్కారు వారి పాట లో సాంగ్స్ కి అద్భుమైన సందర్భాలు కుదిరాయి. అవసరమైన చోటే పాట వస్తుంది. పాటలన్నీ అద్భుతంగా వుండబోతున్నాయి.
గీత గోవిందం లాంటి చార్ట్ బస్టర్ ఆల్బం ని ఇచ్చిన సంగీత దర్శకుడు గోపిసుందర్ ని ఎందుకు పక్కన పెట్టాల్సివచ్చింది ?
పక్కన పెట్టడం కాదండీ. సర్కారు వారి పాట కి వర్క్ చేయాలనుకున్నప్పుడు గోపి సుందర్ చాలా బిజీగా వున్నారు. దాదాపు ఎనిమిది ప్రాజెక్ట్లు అతని చేతిలో వున్నాయి. సమయం కుదరక చేయలేదు కానీ పక్కన పెట్టడం మాత్రం కాదు. నా మనసులో గోపి సుందర్ కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం వుంటుంది.
మహేష్ బాబు గారు ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో ఒక సందేశం ఉండేలా
చూసుకుంటున్నారు. సర్కారు వారి పాట లో అలాంటి మెసేజ్ ఏమైనా వుంటుందా ?
మెసేజ్ వుండదు కానీ పర్పస్ వుంటుంది. సినిమా మొత్తం లైటర్ వెయిన్ లో వినోదాత్మకంగా వెళుతూ చివర్లో ఓ అద్భుతమైన పర్పస్ నేరవేరుతుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ పాయింట్ కి కనెక్ట్ అయ్యేలా వుంటుంది.
సర్కారు వారి పాట కథ మొదట అల్లు అర్జున్ గారి చెప్పారా ?
లేదండీ. ఇది మహేష్ బాబు గారి కోసం పుట్టిన కథ. దేవుడి దయ వల్ల ఆయనే చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నా డ్రీమ్. సర్కారు వారి పాటతో ఆ డ్రీమ్ తీరింది.
గీతగోవిందం విజయం దర్శకుడిగా మీకు ఎలాంటి మలుపుని ఇచ్చింది ?
గీత గోవిందం గొప్ప ఎనర్జీ నింపింది. పరశురాం అనే దర్శకుడు రూ.150కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్ని ఇచ్చింది.
లాక్ డౌన్ తో చాలా గ్యాప్ వచ్చింది కదా.. ఈ గ్యాప్ లో సర్కారు వారి పాట కథలో మార్పులు ఏమైనా చేశారా ?
లేదు. నేను కథ చెప్పిన తర్వాత ఆ కంటెంట్ నచ్చే మహేష్ బాబు గారు ఓకే చేశారు. ఒకవేళ మార్పులు చేయాల్సిన అవసరమే వుంటే.. అసలు అంత దూరం రాదు కదా.
మహేష్ బాబు గారి డ్యాన్స్ లు ఎలా వుండబోతున్నాయి ?
మహేష్ బాబు గారి డ్యాన్సులు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తాయి. డ్యాన్సులు ఇరగదీశారు.
సర్కారు వారి పాటని పోకిరితో పోల్చుతున్నారు ?
పోకిరి ఒక అండర్ కాప్ బిహేవియర్. సర్కారు వారి పాట ఒక కామన్ మాన్ బిహేవియర్. ఇందులో ఇంకాస్త ఓపెన్ అవుతారు. మ్యానరిజమ్స్, లుక్స్ , బాడీ లాంగ్వెజ్.. చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతారు.
‘నేను విన్నాను.. నేను వున్నాను’ డైలాగ్ పెట్టారు.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రేరణా ?
నాకు రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానం. ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్. చాల గొప్ప మాటని సింపుల్ గా చెప్పేశారు. సర్కారు వారి పాట లో కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ గారు ఆ డైలాగు చెప్పారు. నేను కథ చెప్పినపుడే ఈ డైలాగ్ గురించి చెప్పాను. మహేష్ గారు చాలా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ వరకు వచ్చి వెళ్ళిపోయే డైలాగ్ అది. ఆ సీన్ అద్భుతంగా వుంటుంది.
డైలాగులు బాగా రాస్తారు కదా .. దీనికి ప్రేరణ ?
మా గురువు గారు పూరి జగన్నాధ్ గారు, త్రివిక్రమ్ గారి సినిమాలన్నీ చూస్తాం.
పూరి గారు మహేష్ బాబు గారి రెండు సినిమాలు చేశారు. మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా?
మహేష్ గారితో సినిమా చేస్తున్నానని చెప్పాను. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ చూసి ఫోన్ చేశారు. ”థిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రం చేపలపుడ బీచ్ సర్’ డైలాగ్ పూరి గారికి బాగా నచ్చింది.
సెన్సార్ పుర్తయిందా ?
అయ్యింది. కట్స్ ఏమీ లేవు. లెంత్ పర్ఫెక్ట్ గా వుంది. పూరి స్కూల్ నుంచి వచ్చినవారికి లెంత్ సమస్య వుండదు.
తమన్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
తమన్ గారు చార్ట్ బస్టర్ ఆల్బం ఇచ్చారు. సౌండ్స్, ట్యూన్స్ కొత్తగా గా డిజైన్ చేశారు. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్. మాస్ పాట అన్నీ స్క్రిప్ట్ లో వున్నవే. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. సర్కారు వారి పాట కోసం తమన్ యునిక్ స్టయిల్ లో వర్క్ చేశారు.
మహేష్ బాబు గారి డాటర్ సితార సినిమాలో ఉంటారా ?
లేదండీ. ప్రమోషనల్ సాంగ్ కోసం చేశాం. ఇది తమన్ ఐడియా. మహేష్ బాబు గారిని అడిగితే ఓకే అన్నారు.
ఈ మధ్య అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా సిద్ధమౌతున్నాయి. లాక్ డౌన్ లో మీకు సమయం దొరికింది. మరి సర్కారు వారి పాటకు పాన్ ఇండియా ఆలోచన చేయలేదా ?
లేదండీ. మహేష్ గారికి గానీ నాకు గానీ ఆ ఆలోచన లేదు. ముందు ఏ లక్ష్యంతో మొదలుపెట్టామో దాన్ని అందుకోవడానికి కష్టపడాలనుకున్నాం. అన్ని చోట్లకి తెలుగు వెర్షన్ వెళ్తుంది.
తర్వాత ఏ సినిమా చేస్తున్నారు ?
నాగ చైతన్య హీరోగా 14రీల్స్ నిర్మాణంలో సినిమా వుండబోతుంది.
అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ..
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385