‘బందోబస్త్’ కంప్లీట్ ఆల్ రౌండ్ ఎంటర్ టైనర్ – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య

477

ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. ‘గజిని’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మించారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

అనంతరం డి. సురేష్ బాబు మాట్లాడుతూ “లైకా ప్రొడక్షన్స్, తెలుగులో విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్. సూర్య మాకు ఫ్యామిలీలాగే. మా నాన్నగారి సినిమాల్లో వాళ్ళ నాన్నగారు నటించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో నాకు తెలియదు. మంచి మనిషి. వాళ్ళది లవ్లీ ఫ్యామిలీ. తనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

సూర్య మాట్లాడుతూ “ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంత భారీగా తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో రావడానికి కారణమైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారికి థాంక్స్. మా టీమ్ అందరి కలను ఆయన నిజం చేశారు. సెప్టెంబర్ 20న తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి థాంక్స్. లైకా ప్రొడక్షన్స్, ఎన్వీ ప్రసాద్ గారి అమేజింగ్ అసోసియేషన్ గురించి నాకు ఈ రోజు తెలిసింది. ఇక్కడికి వచ్చిన సురేష్ బాబుగారికి థాంక్స్. వర్కింగ్ డే అయినప్పటికీ… ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్.