షకీలా సమర్పణ లో “లేడీస్ నాట్ ఎలౌడ్ “

631

సెన్సెషనల్ స్టార్ షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం “లేడీస్ నాట్ ఎలౌడ్” . కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్ ను రామానాయుడు స్టూడియోస్ లో విడుదల చేశారు. దర్శకుడు సాయిరామ్ మాట్లాడుతూ.. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం. షకీలా గారు రమేష్, విక్రాంత్ అన్న తో కలిసి‌ఈ‌సినిమా చెస్తున్నారు. ‌షకీలా ఫిలిం ఫ్యాక్టరీ పై ఈ చిత్ర తమిళ రైట్స్ ను షకీలా గారు తీసుకున్నారన్నారు. చిత్రీకరణ పూర్తయింది. నెలాఖరులో సెన్సార్ కంప్లీట్ చేసి , వీలైనంత త్వరగా సినిమాను విడుదల చెస్తామన్నారు.

షకీలా మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చూశాను. హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ తో ఉంది. నచ్చి తమిళ్ లో సినిమాను విడుదల చెస్తున్నామన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. షకీలా గారితో కలిసి ఈ సినిమా చెయటం ఆనందంగా ఉంది. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చెయటంతొ పాటు థ్రిల్ చేసెలా దర్శకుడు సాయి ఈ చిత్రాన్ని తీశారన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో రెమో, భారతీ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ‌

గీతా ,హనీ ,నందినీ ,భాను,హర్ష, మధు, ఆనంద్ ,మహేష్ నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మిత్ర, ఎడిటింగ్: కె.ఆర్‌. స్వామి.