HomeTeluguశ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘నీతోనే నేను’ టైటిల్ పోస్ట‌ర్ లాంచ్‌

శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘నీతోనే నేను’ టైటిల్ పోస్ట‌ర్ లాంచ్‌

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర నిర్మాత ఎమ్ సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఘనంగా ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో…

చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘చదువుకునే టైంలోనే సినిమా తీయాలనే కల ఉండేది. నాకు మంచి టీం దొరకడంతోనే ఇలా మీ ముందుకు రాగలిగాను. నా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, నా స్నేహితుడు నవీన్ కుమార్‌లకు థాంక్స్. అంజిరామ్‌ గారితో నాగరాజు గారు ఇది వరకు పని చేశారు. ఆయన వల్లే ప్రాజెక్ట్ కుదిరింది. సినిమాకు పని చేసిన హీరో వికాస్, హీరోయిన్లు మోక్ష, కుషి అందరికీ థాంక్స్. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే నీతోనే నేను. ఈ పాత్రకు హీరో వంద శాతం న్యాయం చేశారు. సినిమా బండి చిత్రంలో ఆయన నటన చూసి ఈ కారెక్టర్‌కు సెట్ అవుతారని అనిపించింది. ఎంతో సహజంగా నటించారు. సీత పాత్రలో మోక్ష చక్కగా నటించారు. ఆయేష కారెక్టర్‌కు కుషిగారు న్యాయం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ.. ‘ఇంత మంచి సినిమాను ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. ఆయన ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని, మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు పైకి ఎంతో సైలెంట్‌గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వయలెంట్. అంజిరామ్ గారు కథ చెప్పినప్పుడే ఓకే చెప్పాను. ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. మా కెమెరామెన్ మురళీ మోహన్ గారు మమ్మల్ని అందంగా చూపించారు. కుషితతో డ్యాన్స్ చేయడం అంత సులభం ఏమీ కాదు. కార్తీక్ మాకు మంచి పాటలు ఇచ్చారు. నెల రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.

డైరెక్టర్ అంజి రామ్ మాట్లాడుతూ.. ‘అనుకున్న టైంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా సుధాకర్ గారు క్వాలిటీగా తీసేందుకు అండగా నిలబడ్డారు. సుధాకర్ రెడ్డి గారి వల్లే ఈ రోజు సినిమా ఇంత బాగా వచ్చింది. మా టీం అద్బుతంగా పని చేసింది. సాంగ్స్, కొరియోగ్రఫీ ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. వికాస్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మోక్ష, కుషిలు చక్కగా నటించారు. మున్ముందు మరిన్ని అప్డేట్లు ఇస్తామ’ని అన్నారు.

హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. కథ విన్నవెంటనే బాగా నచ్చింది. లక్కీ లక్ష్మణ్ వంటి చిత్రం తరువాత ఇలాంటి మంచి కథ రావడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ అంజిరామ్ గారితో ఇది నాకు రెండో సినిమా. కెమెరామెన్ గారు మా అందరినీ అందంగా చూపించారు. సినిమా బండి తరువాత వికాస్ గారి పేరు ఎక్కువగా వినిపించింది. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కార్తీక్ గారి పాటలు అందరికీ నచ్చుతాయి. నేను ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. నేను యాక్సెప్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను. టాలెంట్ ఉన్న వాళ్లను ఇక్కడి ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తుంటారు’ అని అన్నారు.

హీరోయిన్ కుషిత మాట్లాడుతూ ‘‘నీతోనే నేను మంచి ల‌వ్ స్టోరి. అన్నీ ఎమోష‌న్స్ ఉంటాయి. డైరెక్ట‌ర్ అంజిరామ్‌గారు చ‌క్క‌గా సినిమా చేశారు. త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాం’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్, సినిమాటోగ్రాఫర్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అకెళ్ల త‌దిత‌రులు స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

శుక్ర‌వారం (జూలై 28) రోజున నిర్మాత సుధాక‌ర్ రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స‌భ్యులు కేక్ క‌టింగ్ సెల్ర‌బేష‌న్స్‌ను నిర్వ‌హించారు.

న‌టీనటులు:

వికాస్ వ‌శిష్ట‌, మోక్ష‌, కుషిత, అకెళ్ల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌: ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: అంజిరామ్‌
సంగీతం: కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: ముర‌ళీ మోహ‌న్

PRO;NO 1 satish

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES