HomeTeluguశ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ దింగ్స్ గ్యాంగ్ బ్యానర్లో వస్తున్న సినిమా "సొగసు చూడ...

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ దింగ్స్ గ్యాంగ్ బ్యానర్లో వస్తున్న సినిమా “సొగసు చూడ తరమా”.

తల్లాడ సాయికృష్ణ ,స్వప్న చౌదరి అమ్మినేని నటిస్తున్న సినిమా ” సొగసు చూడ తరమా”. టూరిజం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ లుక్ ని శివరాత్రి పండుగ సందర్భంగా విడుదల చేసారు.

ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ రెండో షెడ్యూల్ లో భాగంగా సినిమా ని కాశీ ల్ షూటింగ్ చేస్తున్నాం , శివరాత్రి సందర్భంగా హీరోయిన్ లుక్ ని విడుదల చేసాం అన్నారు. నమస్తే సేట్ జీ సినిమా విడుదల తరువాత టీం అందరం కలిసి ఎఫర్ట్ పెట్టి చేస్తున్న సినిమా ఇది, ఇది పక్క మ్యూజికల్ హిట్ అవుతుందని అన్నారు.

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ నా చిరకాల కోరిక కాశీ అనేది, అనుకోకుండా ఈ శివరాత్రి పండుగ సందర్భంగా మేము కాశి లొనే షూటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.అలానే మా టీం వర్క్ వలన అవుట్ ఫుట్ చాలా బాగా వస్తుంది అని అన్నారు.

తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, నక్షత్ర, శ్రీనివాస్, మణి లీ నటిస్తున్న ఈ సినిమా కి
కో ప్రొడ్యూసర్ – అశోక్ నిమ్మల,
సంగీతం- రామ్ తవ్వ, పవన్,
కెమెరా-సూర్య భగవాన్ మోటూరి,
ఎడిటింగ్- వివేకానంద విక్రాంత్,సౌండ్ ఎఫెక్ట్స్- వెంకట్, పోస్టర్స్ డిజైన్స్- రాహుల్, రాజేష్ బచ్చు, పి.ఆర్.ఓ – పవన్ పాల్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – సాయి మణికంఠ, విజయ్ నిట్టల

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES