*ఎస్.ఆర్.సినీ ఎంటర్టైన్మెంట్స్ ‘శివన్’ ట్రైలర్ లాంచ్ !!!*

523


కల్వకోట సాయిజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.సినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

*ఈ సందర్భంగా డైరెక్టర్ శివన్ మాట్లాడుతూ…* శివన్ ట్రైలర్ లాంచ్ కు వచ్చిన అందరికి ధన్యవాదాలు, టీజర్ లో కొంత బోల్డ్ కంటెంట్ ఉంది. ట్రైలర్ అలా లేదు, కొత్తగా కట్ చేశాం, అందరికి నచ్చుతుందని అనుకుంటున్న. నాకు జన్మ ఇచ్చిన నా తల్లి తండ్రులకు రుణపడి ఉంటాను. నేను డైరెక్టర్ అవ్వడానికి వారి సహాయ సహకారాలు మరువలేనిది. నిర్మాత డి.ఎస్. రావు గారి పాత్ర సినిమాకు హైలెట్ కానుంది.

*నిర్మాత సంతోష్ రెడ్డి మాట్లాడుతూ…* మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు. 2018 లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాను. కాస్త ఆలస్యం అయినా సరే సినిమాను విడుదల చేసి అందరికీ చూపిస్తాము. నిర్మాత సి.కళ్యాణ్ గారు మా సినిమాకు అందించిన సహాయ సహకారాలు మరువలేనిది.

*హీరో సాయిజ మాట్లాడుతూ…* మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు. సినిమా తీయ్యడానికి వచ్చిన కష్టాలన్నీ అధికమించి మేము ఈ సినిమా తీశాము. ట్రైలర్ కు అందరి నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.

*హీరోయిన్ తరునిక మాట్లాడుతూ…* అందరూ కష్టపడి ఈ సినిమా తీశారు. సినిమాలో సస్పెన్స్ ఉంది, అది ప్రేక్షకులకు నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

*సహా నిర్మాత బిట్టు మాట్లాడుతూ…* మీడియా వల్లే టీజర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ను సక్సెస్ చెయ్యాలని ప్రజలను కోరుకుంటున్న. సినిమా చాలా బాగా వచ్చింది. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని తెలిపారు.

*నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ…* మంచి సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే శివన్ సినిమాలో సస్పెన్స్ బాగుంటుంది, ఆడియన్స్ కు ఈ మూవీ నచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.