ఆర్ కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్

279

ఆర్ కె. కళా సాంసృతిక ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న ఆర్. కె.రంజిత్ గారు నేషనల్ గా సైమా అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఉన్నట్టు తెలుగు సినిమారంగానికి ఎటువంటి అవార్డ్స్ లేవని గుర్తించి టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్ పేరుతో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డ్స్ సినిమారంగంలో ఉత్తమ ప్రతిభను కనబరచిన వారికి అందించడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దైవజ్ఞ శర్మ గారు, దర్శకులు సముద్ర, జస్టిస్ డా. బి. మధు సూదన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, సీనియర్ ఆర్టిస్ట్ హేమలత చౌదరి ల చేతులమీదుగా ప్రారంభించడమే కాకుండా వీరి చేతులమీదుగా అనేకమంది నటీ నటులకు మెమోంటోలను ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు నగేష్ నారదాసి,నటుడు కె. యల్ నరసింహారావు, నిర్మాత మూస అలీ ఖాన్, నటుడు ఆర్. మాణిక్యం, నటులు సమ్మెట గాంధీ, షేకింగ్ శేషు, చిత్రం బాషా లతో పాటు అనేక మంది నటీ నటులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ఆర్ కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

ఆర్ కె. కళా సాంసృతిక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆర్. కె రంజిత్ మాట్లాడుతూ..ఈ రోజు నేను ప్రారంభించే టాలీవుడ్ ఫిలిం అవార్డు ఫంక్షన్ కు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.నేను ఆర్ కె. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ను స్థాపించి ఇందులో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది.అయితే నేషనల్ వైజ్ గా చూస్తే సైమా అవార్డ్స్, ఫిలిం ఫేర్ ఈ అవార్డ్స్ లాంటివి ఉన్నాయి. కానీ మన తెలుగు సినిమాకు సంబందించిన కళాకారులకు ఇవ్వడానికి ఒక అవార్డు అంటూ లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ ఫిలిం అవార్డు పేరును సెలెక్ట్ చేసుకొని సినీ పెద్దల సమక్షంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది.ఈ పేరుతో వచ్చే సంవత్సరం నుండి తెలుగు ఇండస్ట్రీ లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన వారికి ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ దర్శకుడు ఇలా ఇండస్ట్రీ లోని అన్ని శాఖల వారందరికీ ఈ అవార్డ్స్ ను ప్రధానం చేయడం జరుగుతుంది. దీనికి మీడియా తో పాటు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ..”తెలుగు వారికంటూ టాలీవుడ్ పేరుతో ఎటువంటి అవార్డ్స్ లేవని ఆర్. కె రంజిత్ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర, రామకృష్ణ గౌడ్,రిటైడ్ జస్టిస్ మధుసూదన్ గార్లే కాకుండా అనేకమంది అరిస్టులు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నవ్వుకు చిరునామా రంజిత్ తను కష్టానికి సుఖానికి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అలాంటి తను టాలీవుడ్ పేరుతో మొదలైన ఈ కార్యక్రమం దిన దినాభివృద్ధి చెంది రంజిత్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ..” సోదరుడు రంజిత్ తలపెట్టిన ఈ మంచి పని దిన దినాభివృద్ధి చెంది టాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఈవెంట్స్ చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.

రిటైడ్ జస్టిస్ బూర్గుల మధు సూదన్ మాట్లాడుతూ ..”మనుషులు యొక్క మనసును రంజింప చేసేటటువంటి వ్యక్తి ఆర్. కె. రంజిత్. టాలీవుడ్ కు ఈ అవార్డ్స్ అనేవి చాలా ముఖ్యం ఇంతకు ముందు తెలుగు రాష్టాలు నంది అవార్డ్స్ ఇచ్చేవి. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇవ్వడం లేదు అది గుర్తించి ఆర్ కె. కళా సాంసృతిక ఫౌండేషన్ చైర్మన్ అయిన నిర్మాత, దర్శకులు ఆర్. కె రంజిత్ గారు సినిమారంగం లోని ఎంతోమంది కళాకారులను గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా వారి కీర్తి ప్రతిష్టలతో టాలీవుడ్ కు మంచి పేరు వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంతో స్టార్ట్ చేసిన రంజిత్ గారు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని అన్నారు

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు .ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..చాలా రోజుల తరువాత మా ఆర్. కె. రంజిత్ గారు ఆర్. కె. ఫౌండేషన్ ద్వారా టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్ 2022 పేరు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.మేము కూడా రెండు రాష్టాల ప్రభుత్వ సహకారం తీసుకొని రెండు సంవత్సరాలకు సంబందించిన సినిమాలకు టి. యఫ్. సి. సి నంది అవార్డ్స్ పేరుతో మేము డిసెంబర్ లో అవార్డ్స్ కార్యక్రమం చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇందులో సినిమా రంగానికే కాకుండా ఇతర రంగాలలో ప్రతిభ చూపిన వారికీ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము.ఇప్పటివరకు తెలంగాణలో నంది అవార్డ్స్ లేవు కాబట్టి ఇప్పుడు చేసే అవార్డ్స్ ఫంక్షన్ ను ఎంతో ప్రతిస్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాము. అమితాబచ్చన్ తో మాట్లాడాము తనకు కూడా లైఫ్ టైమ్ ఆచీవ్ మెంట్ అవార్డ్ ఇస్తున్నాము. మా రంజిత్ గారు ఇంకా ఇలాంటి ఎంకరేజ్ మెంట్ కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వ్యాపార వేత్త డా. రాజశేఖర్ రెడ్డి,డ్యాన్స్ మాస్టర్ నిక్సన్, డా. షేక్ రసూల్, సోషల్ వర్కర్ చందు ఆంజనేయులు,యాక్టర్ జెన్నీ, నిర్మాత సోంపల్లి శ్రీనివాస్, దాసరి రమ్య, యాక్టర్ జబర్దస్త్ జీవన్ కుమార్, పోలీస్ ట్రైనర్ లక్ష్మీ సామ్రాజ్యం, అరిస్ట్ మాలిక్ తదితరులు పాల్గొని రంజిత్ ప్రారంభించిన కార్యక్రమానికి అల్ ద బెస్ట్ చెప్పారు.