శత్రుపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన నాంది చిత్ర నిర్మాత సతీష్ వర్మ

522

వాయుపుత్ర ఆర్ట్స్ పతాకంపై జీవన్, మధుప్రియ హీరో, హీరోయిన్లుగా సోమసుందరం బి.యం దర్శకత్వంలో శ్రీమతి పుష్పలత.బి నిర్మిస్తున్న చిత్రం “శత్రుపురం”. తొలి కాపీ రెడీ అయిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదులకు సిద్ధం అవుతోంది.. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఆగస్ట్12న హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో నాంది చిత్ర నిర్మాత విడుదల చేసారు.. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో

నాంది సతీష్ వర్మ మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులో సీన్స్, లోకేషన్స్ నేచురల్ గా ఉన్నాయి. రియలస్టిక్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం మా నాంది కంటే పెద్ద హిట్ కావాలని.. దర్శక,నిర్మాతలకు, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు మురళి & నాన్లు లు మాట్లాడుతూ… మేము ఇందులో కష్టపడి కాకుండా ఎంతో ఇష్టపడి పని చేశాం.. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి.. అన్నీ పాటలు చాలా బాగా వచ్చాయి.. దర్శక, నిర్మాతలు మా మీద నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేశారు. సినిమాకి ఆర్ ఆర్ చాలా బాగా ప్లస్ అవుతుంది.. అన్నారు.

నటుడు జయచంద్ర మాట్లాడుతూ..విలేజ్ లో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా దర్శకుడు సోము గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. నిర్మాత పుష్పలత గారు మంచి అభిరుచితో ఈ సినిమా తీశారు. శత్రుపురం సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

చిత్ర హీరో జీవన్ మాట్లాడుతూ… పెద్ద హీరో కోసం రాసుకున్న కథతో సోమసుందరం గారు నాతో ఈ సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. ఇది నా రెండవ సినిమా ఇందులోని యాక్షన్ సీన్స్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి గూజ్ బమ్స్ వస్తాయి.. అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

సినటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులేమోని మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సోమ సుందరం గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతీ సీను చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. అడవుల్లో వుండే గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా సినిమాను రియలిస్టిక్ గా తీశారు. సినిమా కంటెంట్, యాక్షన్ పరంగా చాలా బాగుండడంతో  మేము ఈ సినిమాను టేకప్ చేసి మా సినేటెరియా ద్వారా సెప్టెంబర్ లో అత్యధిక ధియేటర్సలలో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము అని అన్నారు.

చిత్ర దర్శకుడు సోమ సుందరం మాట్లాడుతూ .. నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేశాము. ఒక ఊరిలో పైకి మంచిగా నటిస్తూ.. ఎవరికీ తెలీకుండా అక్రమాలు,అరాచకాలు సృష్టిస్తూ.. అతిభయాంకరంగా క్రూరమైన హత్యలు చేస్తున్న ఒక ముగ్గురు దుర్మార్గులను హీరో ఎలా హతమార్చాడు అనేది చిత్రం మెయిన్ కాన్సెప్ట్.. సినిమా చాలా బాగా వచ్చింది. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.. అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందం అంతా సినిమా బాగా వచ్చింది. మాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

జీవన్, మధుప్రియ, చరణ్ శివ, హర్ష, రవి, జవహర్, జయచంద్ర, కపిల్, హరీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం; మురళి నాన్లు, కెమెరా; ప్రభు, ఎడిటర్; మొరాజ్, కాస్టూమ్స్: కృష్ణ చైతన్య, ఫైట్స్; కృష్ణ చైతన్య, మేకప్; ముని, కొరియోగ్రఫీ; పవన్ విక్కీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్; భాస్కర్ రాజు, పి.ఆర్.ఓ; జిల్లా సురేష్,

నిర్మాత‌; శ్రీమతి పుష్పలత. బి,
క‌థ‌-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు- ద‌ర్శ‌కత్వం-సోమసుందరం.బి.యం.