కన్నడ హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ చిత్రం ‘సీతాయణం’ ఫస్ట్ లుక్ విడుదల!!

701

అనేక తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలతో సుపరిచితులైన కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న “సీతాయణం” ఫస్ట్ లుక్ ని మార్చి 11, బుధవారం విడుదల చేశారు.

ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడలో పాటు, తమిళంలో డబ్బింగ్ చేసి, అన్నీ ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ” రెస్పెక్ట్ ఉమెన్ అన్న శీర్షికతో ప్రేమ, క్రైమ్, డ్రామా గా నడిచే చిత్రమిది. కథ కథనాలు నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటాయి. చిత్రంలోని పాటలు ఆకట్టుకుంటాయి. 63 రోజులపాటు బ్యాంకాక్, బెంగళూర్, మంగళూర్, ఆగుంబే, విశాఖపట్నం, తదితర ప్రాంతాలలో షూటింగ్ జరిపాం, క్లైమాక్స్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ లో నిలుపుతుంది. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.

దర్శకడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ, ” సీతాయణం, నేటి తరానికి నచ్చేలా, హృద్యమైన అంశాలు, సన్నివేశాలతో రాసుకున్న కథ. నిర్మాతల పూర్తి సహకారంతో, నటీ నటుల అద్భుతమైన ప్రదర్శనతో అనుకున్నట్టుగా తెరకెక్కిస్తున్నాం. మా యుంగ్ సుప్రీం హీరో అక్షిత్ కి ఈ చిత్రం చాలా పెద్ద పెద్ద అవకాశాల్ని తెస్తుంది. హీరోయిన్ అనహిత చాలా బాగా చేసింది, వారిద్దరి జోడి చాలా బాగా కుదిరింది.” అన్నారు.

తారాగణం: అజయ్ ఘోష్, మధునంధన్, విధ్యులేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ భగవాన్, గుండు సుదర్శన్, అనంత్, జభర్ధస్ట్ అప్పారావు, టి యన్ ఆర్, మధుమణి, మేఘనా గౌడ తదితరులు.

రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక
కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: అనీష్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి