…యురేక, హీరో అండ్ దర్శకుడు కార్తిక్ ఆనంద్

627

ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్,డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యురేక’.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమాని నిర్మించారు. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర డైరెక్టర్ మరియు హీరో కార్తిక్ ఆనంద్ మీడియా తో ముచ్చటించారు.

“కార్తిక్ ఆనంద్ నా పేరు, హైదరాబాద్ లో చదువుకోవడం జరిగింది, ప్రకాశం జిల్లా గిద్దలూరు మాది, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాను, సినిమాల పట్ల ఆసక్తితో చిన్న చిన్న సినిమాలకు వర్క్ చేశాను, సొంతంగా డైరెక్ట్ చేద్దాం అనుకుకొని ఒక చిన్న యూనిట్ తో యురేక సినిమా తీసాను.

కాలేజ్ లో జరిగిన ఒక ఫంక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సినిమా ట్రైలర్ చూస్తే మీకు అర్థం అవుతుంది. యూత్ ఫుల్ గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. కాలేజ్ లో జరిగే ఒక ఫెస్ట్ పేరు యురేక, అందువల్లే ఈ సినిమాకు యురేక అనే టైటిల్ ను పెట్టడం జరిగింది.

యురేక సినిమా కంటె ముందు ఒక ఇండిపెండెంట్ మూవీ తీశాము, కొంత తీసాక బడ్జెట్ ఎక్కువ అవుతుందనని అది స్టాప్ చేసి యురేక సబ్జెక్ట్ ను టేకప్ చేశాను, యురేక షూటింగ్ సమయంలో అందరూ బాగా సపోర్ట్ చేశారు, సినిమాను కొంతమందికి చూపించాను అందరూ బాగుంది అన్నారు. అదే నాకు సినిమా పై కాన్ఫిడెన్స్ ని పెంచింది. ఆడియన్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను.

క్రైమ్, కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. కాలేజ్ నేపథ్యంలో నడిచే సినిమా కావున యూత్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ టైమ్ లో మా అమ్మ గారు బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు మేకింగ్ విషయంలో ప్రశాంత్ గారు బాగా హెల్ప్ అయ్యారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేసిన ప్రశాంత్ గారికి స్పెషల్ థాంక్స్.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ముగ్గురూ మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. నేను రాసుకున్న పాయింట్ ను అనుకున్న దానికంటే బాగా తీసానని భావిస్తున్నాను. సినిమా చూస్తున్న సమయంలో అది క్లియర్ గా కనిపించింది. సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. మార్చి 13న విడుదల కానున్న మా యురేక సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నానని ” ముగించారు.

నటీనటులు:
కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి,సయ్యద్ సోహైల్ రియాన్,షాలిని సమీక్ష,
బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ, మహేష్
విట్టా, మస్త్ అలీ ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు.
సాంకేతికవర్గం:
దర్శకత్వం: కార్తీక్ ఆనంద్
నిర్మాత: ప్రశాంత్ తాత
సహా నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల
సంగీతం: నరేష్ కుమరన్
డివోపి: ఎన్.బి. విశ్వకాంత్
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి
ఆర్ట్: అవినాష్ కొల్ల
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి
సాహిత్యం: రామాంజనేయులు
పీఆర్ వో:జి.ఎస్.కె మీడియా