*ఒక్కడే నటుడు..అతడే నట సైన్యం !!!*

548

తెలుగు సినిమాల్లో విలన్‌గా, కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన జయప్రకాష్ రెడ్డి ఏకపాత్రాభినయం చేసిన సినిమా అలెగ్జాండర్‌. ధవళ సత్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌‌ పై జయప్రకాష్ రెడ్డి స్వయంగా నిర్మించాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన సినిమాలో కేవలం జయప్రకాష్ రెడ్డి ఒక్కడే పాత్రధారి కావడం విశేషం.

ఈ సందర్భంగా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ
‘రంగస్థల నటుడిగా నాకు నాటకాలంటే ప్రాణం. అదే నన్ను సినిమాల్లో నటుడ్ని చేసింది. వన్ మ్యాన్ షో చేద్దామని రచయిత పూసలకు చెబితే ఆయన అద్భుతమైన స్ర్కీప్ట్ ఇచ్చారు. వంద నిమిషాల నిడివితో ఉండే కథతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవైఆరు ప్రదర్శనలు ఇచ్చాను. ఆ కథనే సినిమాగా తీద్దామని.. ధవళసత్యం దర్శకత్వంలో నటించాను. ఆయనకు సదా నేను రుణపడి ఉంటాను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించింది ప్రేక్షకులకు చేరువకావాడం కష్టం. ఆ క్రమంలోనే ఓటీటీ ప్లాప్ ఫామ్ ద్వారా ఈ సినిమాను ఎవరైనా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారేమో చూస్తున్నాం. రిటైర్డ్‌ మేజర్ ఒక హెల్ప్ లైన్ ద్వారా కొందరి సమస్యలను తీర్చడం కథలో కనిపిస్తుంది. మా ఈ ప్రయత్నాన్ని ప్రొత్సహిస్తారని ఆశిస్తున్నా’అన్నారు.

దర్శకుడు ధవళ సత్యం మాట్లాడుతూ
‘మేం కలిసి పనిచేసిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఇద్దరం నాటక రంగం నుంచే రావడంతో మామధ్య అనుబంధం మరింత పెరిగింది. ఇలాంటి ప్రయోగాలు చేయడం నాకు సరదాగా ఉంటుంది. ఏకపాత్రాభినయం అనుకుంటారు…కానీ వెనుక నుంచి వచ్చే కొందరు నటుల వాయిస్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. అన్నీ కోణాల్లో జయప్రకాష్ రెడ్డి కనిపిస్తారు. ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’అన్నారు.