సీతన్న పేట గేట్ ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేసిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్

755

వావ్ సినిమా పతాకంపై అనిల్ నిర్మాణంలో రాజ్ కుమార్ దర్శకునిగా పరిచయం చేస్తూ వాస్తవ సంఘటనలు ఆధారంగా విజయవాడ బ్యాక్ డ్రాప్ లో రూపోందిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా‘సీతన్న పేట గేట్. మనిషి లోని నేర ప్రవృత్తిని ఇతి వృత్తంగా వాటి పర్యవసానాలను వళ్ళు గగుర్పొడిచే విధంగా తెరకెక్కిన ‘సీతన్నపేట గేట్’ ఫస్ట్ లుక్ ని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ లాంఛ్ చేసారు. ఈ సినిమా కథ, కథనాలను తెలుసుకొని సినిమా విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసారు. ఈ రియలిస్ట్ కథలో మెయిన్ లీడ్స్ గా యశ్వన్, వేణు గోపాల్, కిస్లీ చౌధరి, సురభి తివారి నటిస్తున్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు వై రాజ్ కుమార్ మట్లాడుతూ:
‘‘ కొన్ని వాస్తవసంఘటనలు ఆధారంగా సీతన్న పేట గేట్ కథను రెడీ చేసుకున్నాను. నేర ప్రవృత్తిని పురికొల్పే ఆశలు మనిషిని ఎలాంటి దారిలోని తీసుకెళ్తాయి అనే సంఘటనలను చాలా రియలిస్టిక్ గా చేయడం జరిగింది. క్రైమ్ సస్పెన్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకుల ఆదరిస్తారనే నమ్మకం ఉంది. దర్శకుడిగా తొలి ప్రయత్నం అయినా నాకు టెక్నిషన్స్ అందించిన సహాకారం మరిచిపోలేను.విజయవాడ నేపథ్యంలో క్రైమ్ కథ అనగానే గుణదల, క్రిష్ణలంక మాత్రమే కాదు.. ఎవరికీ తెలియని చరిత్ర కలిగిన ‘సీతన్నపేట గేట్’ ఉంది. ఈ కథకు బీజం ఆ ప్రాంతంలోని కథలే కారణం. నేటి తరం ఆలోచనలు ఎంత వేగంగా ఉంటున్నాయో అందరికీ తెలుసు.. ఆవేగం వెనక ప్రమాదాలను వాస్తవికంగా చూపించడం జరిగింది. ఈ కథలో ఉన్న ప్రేమకథ కూడా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుండి తీసుకున్నదే. ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ లో ఉంది.’’ అన్నారు.

నటీ నటులు:
యశ్విన్, వేణు గోపాల్ , కిస్లీ ఛౌదరి, సురభి తివారి, సుధిక్ష, అనుష జైన్, రఘుమారెడ్డి , 8 పి యమ్ సాయి, పార్థుతదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం: మ్యూజిక్: ఎన్ ఎస్. ప్రసు, స్టంట్స్: వింగ్ చున్ అంజి, ఎడిటర్ : శివ శర్వాని, సినిమాటోగ్రఫి: చిడతల నవీన్, కొరియోగ్రఫీ: అనిష్, లిరిక్స్: మనికంఠ శంకు, డైలాగ్స్: రవి భయ్యవరపు, డిఐ: పురుషోత్తమ్. డిటియస్: పద్మారావు. పి.ఆర్ .ఓ : జియస్ కె మీడియా నిర్మాత : అనిల్ దర్శకత్వం : వై రాజ్ కుమార్.