క్రైమ్ థ్రిల్లర్ సినిమా అగ్లీ నవంబర్ 8 న విడుదల

574


అస్మక క్రియేషన్స్ పతాకం పై రోహిత్ కుమార్, సత్య భగత్ , ప్రియాంక పాండే, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లు గా దయ రచన దర్శకత్వం లో సుశాంత్ కుమార్ బండారి నిర్మించిన చిత్రం అగ్లీ. ఈ చిత్రం నవంబర్ 8న విడుదలవుతుంది.

ఈ సందర్భం గా దర్శకుడు దయ మాట్లాడుతూ “ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. యూత్ కి బాగా నచ్చుతుంది. కేవలం 29 రోజుల్లో మంచి క్వాలిటీ సినిమా తీసాము. సినిమా బాగా వచ్చింది. మా నిర్మాత సుశాంత్ కుమార్ బండారి గారికి నాకు ఈ సినిమా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నవంబర్ 8నా మా అగ్లీ సినిమా విడులవుతుంది” అని తెలిపారు.

నిర్మాత సుశాంత్ కుమార్ బండా మాట్లాడుతూ “సినిమా పేరు అగ్లీ కాని మా సినిమా చాల అందంగా ఉంటుంది. ఇది నా మొదటి సినిమా. కేవలం 29 రోజుల్లో షూటింగ్ పూర్తీ చేసాము. సినిమా చాలా బాగావచ్చింది. దర్శకుడు దయ చాలా బాగా చిత్రకరించారు. ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. ముందు మరెన్నో చిత్రాలను నిర్మిస్తాను” అని అన్నారు.

నటినటులు, రోహిత్ కుమార్, సత్య భగత్ , ప్రియాంక పాండే, సోనాక్షి వర్మ, కిరణ్, అక్షయ్,

కెమెరా మాన్ విజయ్ కుమార్ SVK
మ్యూజిక్ డైరెక్టర్ స్మరన్