రొమాంటిక్‌ హర్రర్ `బంజార` టీజ‌ర్ విడుద‌ల‌.

570

మంచి కుటుంబ కథాంశంతో కూడిన హర్రర్ హిట్ మూవీ “క్షుద్ర” చిత్రాన్ని అందించిన దర్శకుడు నాగుల్ దర్శకత్వంలో వర్కింగ్ యాంట్స్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై కోయా రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించిన రొమాంటిక్‌ హర్రర్ చిత్రం `బంజార`. అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. తెలుగు, తమిళ భాష‌ల‌ల్లో మార్చిలో విడుదలకు సిద్దమ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

చిత్ర నిర్మాత కోయా ర‌మేష్ బాబు మాట్లాడుతూ – `మా `బంజార‌` చిత్రం టీజ‌ర్ విడుద‌ల‌చేయ‌డం సంతోషంగా ఉంది. ఇది నిజంగా రొటీను కు భిన్నమైన హర్రర్ కథా చిత్రం. త‌ప్ప‌కుండా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నిఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మా ద‌ర్శ‌కుడు నాగుల్ మంచి విజ‌న్‌లో చిత్రాన్ని తెర‌కెక్కించారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రూ చ‌క్క‌గా న‌టించారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునే ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశంకూడా ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి మార్చి నెల‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాం.“ అన్నారు.

అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ, బెనర్జీ, శరత్, వేదం నాగయ్య, అనంత్, జబర్ధస్త్ రైజింగ్ రాజు, అప్పారావు, శాంతి స్వరూప్, జ్యోతి శ్రీ, దొరబాబు త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి
సంగీతం: ఘంటాడి కృష్ణ,
పాటలు: కోయా రమేష్ బాబు,
సినిమాటోగ్ర‌ఫి: A. వెంకట్,
ఎడిటింగ్: B.మహేంద్ర,
ఆర్ట్: B.V. ప్రసాద్,
నిర్మాతలు : కోయా రమేష్ బాబు , దేవభక్తుని నవీన,
రచన, దర్శకత్వం: నాగుల్.