*మార్చి 13న రిలీజ్ కానున్న లవ్ థ్రిల్లర్ ‘‘యురేక’’*

509

ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యురేక’.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు..లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 13న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్.
ఈ సందర్భంగా హీరో మరియు దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఇది.. చాలా బాగా వచ్చింది.. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది…ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది..మార్చి 13న రిలీజ్ కానున్న మా మూవీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ.. యురేక సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతిఒక్కరికకీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.. డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ అద్భుతంగా ఈ సినిమా ని తెరకెక్కించారు.. ప్రపంచవ్యాప్తంగా మార్చి 13న రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు.
నటీనటులు:
కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, షాలినీ,మున్నా, సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు.
సాంకేతికవర్గం:
దర్శకత్వం: కార్తీక్ ఆనంద్
నిర్మాత: ప్రశాంత్ తాత
సహా నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల
సంగీతం: నరేష్ కుమరన్
డివోపి: ఎన్.బి. విశ్వకాంత్
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి
ఆర్ట్: అవినాష్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి
సాహిత్యం: రామాంజనేయులు
పీఆర్ వో:జి.ఎస్.కె మీడియా
Attachments area