రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో గ్రాండ్ గా జరిగింది. లక్ష్మణ్ , కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్ల జమిందార్, బాగుమతి చిత్రాల దర్శకుడు అశోక్ మరియు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసారు.
తొలి సన్నివేశానికి రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ అశోక్ స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కు అందజేశారు. అలాగే జీడీ డైరెక్టర్ విశ్వనాధ్ అరిగెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి పేరు రావాలని అతిధులు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు డి.నాగ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ…
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలో తెలియజేస్తాము. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన డైరెక్టర్ అశోక్ గారికి, నిర్మాత రాజ్ కందుకూరి గారికి, జోడి డైరెక్టర్ విశ్వనాధ్ అరిగెల గారికి ధన్యవాదాలు. నూతన నటీనటులు చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుండి ప్రారంభం కానుంది. మా చిత్ర యూనిట్ అందరికి మీ సపోర్ట్ కావాలని తెలిపారు.
నటీనటులు: లక్ష్మణ్, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి
లిరిక్స్: శేఖర్ రాజు విజయ భట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి.