రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం “అమ్మాయి”. డిసెంబర్ 10న విడుదల కాబోతుంది

379

బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రం స్ఫూర్తితో

రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన మరియు ప్రతిష్టాత్మకమైన సినిమా “అమ్మాయి”. ఈ చిత్రాన్ని హిందీ మరియు చైనీస్ భాషలో విడుదలకు సిద్ధం అవుతుండగా తెలుగు, తమిళ మరియు కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు..

ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ మరియు చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

అమ్మాయి” చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులు అయినా పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తన ఫైటింగ్ స్కిల్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ కి అంకితం ఇస్తున్నారు.

“అమ్మాయి” చిత్రం భారత దేశంలోనే మొదటి వాస్తవికమైన మార్షల్ ఆర్ట్స్ చిత్రం.

అమ్మాయి చైనీస్ వెర్షన్ చిత్రాన్ని చైనా లోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ వారు డ్రాగన్ గర్ల్ పేరుతో భారీ ప్రమోషన్ తో 20 వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

చైనా లో నవంబర్ 27న బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు సందర్భంగా ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లి ప్రారంభ చిత్రంగా ప్రదర్శింపబడుతోంది. అంతే కాకుండా దుబాయ్ లో ప్రపంచం లోనే ఎతైన బుర్జ్ ఖలీఫా భవనం మీద అమ్మాయి చిత్రం మొదటి ప్రపంచ ప్రోమోని చూపించబోతున్నారు.

చిత్రం పేరు : అమ్మాయి

ప్రధాన పాత్ర : పూజ భలేకర్

సంగీతం : రవి శంకర్, డి ఎస్ అర్

కెమెరా మాన్ : మలహర్ భట్ జోషి

ఎడిటర్ : కమల్ రామడుగు, ప్రభు దేవా

ఆర్ట్ డైరెక్టర్ : మధుకర్ దేవర

బ్యానర్ : ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్, బిగ్ పీపుల్

దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ