నవీన్ చంద్ర, అవికా గోర్ #BRO నుంచి ‘ఓ మై డియర్ బ్రదర్’ లిరికల్ సాంగ్ విడుదల..

594


నవీన్ చంద్ర, అవికా గోర్ జంటగా కార్తిక్ తుపురాని తెరకెక్కిస్తున్న సినిమా #BRO. JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై JJR రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మైడ్ డియర్ బ్రదర్ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. సీనియర్ లిరిక్ రైటర్ భాస్కరభట్ల ఈ పాటను రాసారు. శేఖర్ చంద్ర సంగీతం స్వరపరిచిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న #BRO సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటర్. సచిన్ కుందాల్కర్ ఈ సినిమాకు కథ అందించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.

నటీనటులు:
నవీన్ చంద్ర, అవికా గోర్

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తిక్ తుపురాని
నిర్మాత: జేజేఆర్ రవిచంద్
బ్యానర్: జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్
సంగీతం: శేఖర్ చంద్ర
లిరిసిస్ట్: భాస్కర భట్ల
సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్
ఎడిటర్: విప్లవ్ నైషధం
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్