HomeTeluguఒకప్పుడు టీవీ9 ఉద్యోగులకు జరిగిందే ఇప్పుడు తొలివెలుగు రఘుకి జరిగింది.

ఒకప్పుడు టీవీ9 ఉద్యోగులకు జరిగిందే ఇప్పుడు తొలివెలుగు రఘుకి జరిగింది.


రవి ప్రకాష్ మళ్లీ మోసం చేస్తాడా? కొత్త చానల్ ఎవరి మెప్పు కోసం
తిట్టిన నోటితోనే కేసీఆర్ బూట్లు నాకేందుకు సిద్దమయ్యాడా
టీవీ9 ఉద్యోగులు దద్దమ్మలా
వారి కన్న తొలివెలుగు రఘు చాలా బెటరా
4 ఏళ్లకే రవి ప్రకాష్ మోసాలను బయటపెట్టాడా
మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఇదే

వాడుకుని వదిలేయడం రవి ప్రకాష్ కు వెన్నతో పెట్టిన విద్య. మరోసారి అదే పని చేయబోతున్నాడు. 15 ఏళ్లు ఉద్యోగుల శ్రమను రవి ప్రకాష్ దోచుకుని కోట్లు వెనకేసుకున్నాడు. డొక్కు చేతక్ స్కూటర్ నుండి పోర్ష్ కారు స్థాయికి ఎదిగాడు. వేల కోట్లు అక్రమంగా సంపాదించాడు.. హవాలా మాఫియా లింకులు. హైదరాబాద్ భూ కబ్జాదారులతో సాన్నిహిత్యం అతని సొంతం. ఇవి తెలిసినా చేతగాని దద్దమ్మాల్లా టీవీ9 ఉద్యోగులు నోరు మూసుకున్నారు. రవి ప్రకాష్ హవాలా ద్వారా వేల కోట్లకు పడగెత్తినా సిగ్గు లేకుండా చూస్తా ఉన్నారు. వాటి వెనక రహస్యాలు తెలిసినా నోరు మెదపలేదు. కుక్కిన పెనుల్లా కూర్చున్నారు ఆయనతో పని చేసిన ఉద్యోగులు. కానీ ఇప్పుడు సీన్ మారింది.

బయటపెట్టిన తొలి వెలుగు రఘ
ఒకప్పుడు టీవీ9 ఉద్యోగులకు జరిగిందే ఇప్పుడు తొలివెలుగు రఘుకి జరిగింది. టీవీ9 నుంచి బయటకు వచ్చినప్పుడు రవి ప్రకాష్ కు వెన్నుదన్నుగా నిలిచాడు రఘ. అన్నీ తానై ఆయన కోసం కష్టపడ్డాడు. కానీ నాలుగేళ్లు వాడుకుని వదిలేశాడు రఘను. పాపం. తొలి వెలుగు వెబ్ సైట్, యూట్యూబ్ ను వెలుగులోకి తెచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడ్డాడు రఘ. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వార్తలకు గాను చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆపదలో అండగా నిలిచిన వారిని జీవితాంతం మర్చిపోరు. కానీ ఆర్పీకి అవేం పట్టలేదు. తొలి వెలుగు నుంచి రఘను పంపేశాడు. ఏరు దాటాకా తెప్ప తగలేసినట్లు… అవసరం తీరాక రఘును పక్కన పెట్టేశాడు.

సరికొత్తగా కేసీఆర్ బూట్లు నాకడానికి రవి ప్రకాష్ సిద్దమయ్యాడని..తొలి వెలుగును వారికి రూ.15 కోట్లకు అమ్మేశాడని వెలుగెత్తాడు రఘ. ఇప్పుడు అదే న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాస్తంత బూతులు అందుకు జోడించాడు. తీన్మార్ మల్లన్న లైవ్ షోలో రవి ప్రకాష్ బాగోతాన్ని బట్ట బయలు చేశాడు రఘ. మళ్ళీ మన సెంటిమెంటును , మన శ్రమను దోచుకోడానికి కొత్త రూపంలో వస్తున్న ఆ చెత్త…నా కొ… చెప్పుతో కొట్టాలి. ఇంకెంతమంది ఉద్యోగుల శ్రమను వాడు దోచుకొని కోట్లకు ఎదుగుతాడు ? అని ప్రశ్నించాడు.

రవి ప్రకాష్ ఒక స్మగ్లర్ అని గతంలో ట్వీట్ ద్వారా పవన్ కల్యాణ్ బయట పెట్టాడు. ఈసారి ఎవరు స్పందిస్తారో మరి.

సిగ్గులేని టీవీ9 ఉద్యోగులు
నాలుగేళ్ల పాటు పని చేసిన రఘనే నా రక్త మాంసం అమ్ముకున్నానని గుండెలు బాదుకుంటుంటే.. 15 ఏళ్లు రవి ప్రకాష్ చేతిలో మోసపోయిన వారు ఎంతగా రాటుదేలాలి. రఘను చూసి కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలంటున్నారు. రఘ ఎపిసోడ్ తర్వాత వారిలో ఆలోచనలో మార్పు వస్తోంది. టీవీ9లో రవి ప్రకాష్ చేసిన బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగిన ఆధారాలు ఇస్తామంటున్నారు. ఇది ఎటుదారి తీస్తుందో చూడాలి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES