బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన జంటగా రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో ఎ హవీష్ ప్రొడక్షన బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళ ‘రాట్చసన’ చిత్రానికి రీమేక్ ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి రమేష్ వర్మ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు…‘
ఈ సినిమా చేయడం ఎలా అనిపించింది?
– సినిమా ఎంత థ్రిల్లింగ్‌గా ఉందో, నా ఎగ్జయిట్‌మెంట్ కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది రమేష్ వర్మ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమా విషయంలో మీరు చాలా వరకు కాపీ పేస్ట్ చేశారు. ఇప్పుడు ఏమనిపిస్తోంది?
– కాపీ పేస్ట్ అంటే… నా చిన్నప్పటి నుంచీ నేను సూపర్‌గుడ్ ఫిలిమ్స్‌లో చాలా రీమేక్‌లు చూశా. అవన్నీ సక్సెస్‌లే. నా కెరీర్‌లో ఇది నా ఐదో సినిమా. నేనెప్పుడూ రీమేక్ సినిమా చేయాలని అనుకోలేదు. కానీ, ఈ సినిమాలో కంటెంట్ చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది. అక్కడున్న టెంపోని ఇక్కడ నేను మళ్లీ తీసుకొచ్చా. ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం అంటే అంత మామూలు విషయం కాదు. అలాగే రీమేక్ చేయడం ఈజీ కాదు. ఇండియా లెవల్లో ఎన్నో సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అవన్నీ హిట్ అయ్యాయా? కాకపోతే నేను సక్సెస్ అయ్యాను. ఒరిజినల్ డైరక్టర్ ఎంతలా హార్ట్ పెట్టి చేశాడో, నేనూ అంతే చేశా. నిజానికి ఒరిజినల్ డైరక్టర్ రెండేళ్లు ఈ సినిమా చేశాడు. నేను ఇక్కడ మూడు నెలల్లో తీశా. ఒరిజినల్ సినిమాలో హార్ట్ ఎంత ఉందో, ఇందులోనూ అంత ఉంది. కత్తిమీద సాము అది. అయినా చేసి సక్సెస్ అయ్యా.
ఒరిజినల్‌కు చేంజెస్ చేయవద్దు అనేది మీ నిర్ణయమా? నిర్మాత నిర్ణయమా?
– తమిళ్‌లో సెన్సార్ వెర్షన 3 గంటలు చేశారు. అలాగే విడుదల చేయాలని డైరక్టర్ పట్టుబడితే, పెద్ద గొడవలయ్యాయట. అప్పుడు అందరూ అక్కడ డైరక్టర్‌ని కన్విన్స చేసి 2.32గంటల్లో సినిమాను విడుదల చేశారు. నేను ఆ విడుదలైన వెర్షననే చూశా. జిరాక్స్ చేయడం కూడా ఈజీ కాదు. ఇండియాలో టాప్ గ్రాసర్ సినిమాను ఓ సౌత ఇండియన డైరక్టర్ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఐఎండీబీలో టాప్ సెకండ్ సినిమాను మేం చేశాం. ప్రూవ్ చేసుకున్నాం.
‘ అంత అడిగిన ఆయన ఈ సినిమాను నిర్మించలేదా?
– స్పాట్‌లో డబ్బులు కట్టి హక్కులు కొన్న కోనేరు సత్యనారాయణగారిలాంటి వండర్‌ఫుల్ నిర్మాత చేస్తానంటే ఆయనెందుకు వద్దంటారు.‘
ఈ సినిమా చూసిన వాళ్లలో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వారు ఎవరు?
– ఎవరో కాంప్లిమెంట్ ఇస్తారని నేను చేయలేదండీ. నాకు ఆత్మసంతృప్తి కలిగింది. ఇంకో విషయం ఏంటంటే సినిమా చూసి బెల్లంకొండ శ్రీనివాస్ ఫాదర్ నాకు మెసేజ్ చేశారు. ‘మా అబ్బాయికి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ ఇచ్చావు’ అని. సినిమా చూసిన పది నిమిషాల్లో హీరో పాదర్ అలా మెసేజ్ పెట్టడం ఆనందాన్ని కలిగించింది – సాగర్‌ని నా లవ్ స్టోరీకి డైలాగు రైటర్‌గా పెట్టుకున్నా. ఆ సినిమా ఆపేశాను. అతనికి అడ్వాన్స ఇచ్చి అలా ఆపేయడం నాకు నచ్చలేదు. అందుకే ఈ సినిమాకు కంటిన్యూ చేశా. ఎందుకంటే అతనికి తమిళ్ తెలుసు.
‘ జిబ్రానగారిని పెట్టుకోవడానికి కారణం ఏంటి?
– జిబ్రన లేకుంటే ఈ సినిమా లేదు. బీజీఎం వల్లనే ఈ సినిమా ఎలివేట్ అయింది. అందుకే అతన్నే పెట్టుకున్నా. పైగా అతను ‘సాహో’తో చాలా బిజీగా ఉన్నాడు. అయినా నాకు చాలా హెల్ప్ చేశాడు.
‘ మీ దగ్గర పనిచేసిన వాళ్లు ఇప్పుడు సెటిల్ అయ్యారు..
– నిజమే. రాక్షసుడికి నా దగ్గర మొత్తం కొత్త టీమ్ వచ్చింది. ఇంతకు ముందు నా దగ్గర పనిచేసిన వాళ్లందరూ డైరక్టర్లు అయిపోయారు. అందరూ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. నా దగ్గర పనిచేసిన వాళ్ల దగ్గర నేను ఏదైనా సరే వింటా. వాళ్లు నా దగ్గర స్వేచ్ఛగా ఉంటారు. విరించి,సప్తగిరి, మంజునాథ్.. ఇలా అందరూ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్లలో ప్యాషన నచ్చితే నేను వెంటనే వాళ్లను అసిస్టెంట్లుగా తీసుకుంటా.
‘ ప్రొడక్షన టీమ్ ఎలా సపోర్ట్ చేసింది?
– కోనేరు సత్యనారాయణగారికి నా మీద నమ్మకం ఉంది. ‘నీకు ఇష్టం వచ్చినట్టు తీయి’ అని అన్నారు. ప్రొడక్షన టీమ్ మొత్తం నేనే సెట్ చేసుకున్నా. అందుకే అనుకున్న సక్సెస్ వచ్చింది.