HomeCeleb Interviewsరాజుగారిగది 3 హీరో అశ్విన్ ఇంటర్వ్యూ..

రాజుగారిగది 3 హీరో అశ్విన్ ఇంటర్వ్యూ..

రాజుగారిగది 3 ఎలా వచ్చింది..?
రాజుగారిగది అనే సినిమా చేసినపుడు 2,3 చేస్తామని అనుకోలేదు. ప్రేక్షక దేవుళ్లు ఆదరించారు. అప్పుడు పార్ట్ 2కు నాగార్జున, సమంత గారి సపోర్ట్ వచ్చింది. నేను కూడా అందులో భాగం కావడం అదృష్టం. పార్ట్ 2లో ఎంటర్‌టైన్మెంట్ తగ్గింది అన్నారు.. అందుకే ఇప్పుడు పార్ట్ 3 వస్తుంది. ఇందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయం.

ఒకే సబ్జెక్ట్ మీద చేస్తుంటే బోర్ కొట్టదా..?
ఒకే సబ్జెక్ట్ మీద కాదు.. ప్రతీ సినిమాలోనూ కథలు ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టే సినిమాలు ఆదరిస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్ట్ 3.. ఇది సక్సెస్ అయితే 4 కూడా వస్తుందేమో చెప్పలేం.

మూడో భాగం కేవలం కామెడీ కోసమే చేసారా..?
కాదండి.. కామెడీ కాదు.. హార్రర్ కామెడీ. అది కూడా రెండో భాగంలో నాగార్జున, సమంత లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి ఎంటర్‌టైన్మెంట్ తగ్గిందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకే మూడో భాగం కేవలం హార్రర్ కామెడీ కోసమే చేసాం.

సినిమాలో మీ కారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా కారెక్టర్ పక్కా మాస్. నా పాత్ర కోసం నేను పూర్తిగా దర్శకుడిని ఫాలో అవుతాను. తొలి రెండు భాగాల్లో అదే చేసాను. ఇప్పుడు కూడా ఇదే చేసాను. అయితే మాస్ కారెక్టర్ కాబట్టి మనకు తెలియకుండానే మాస్ రాజా రవితేజ, చిరంజీవి, రజినీకాంత్ వాళ్లను ఫాలో అవ్వాలి.. సాంగ్స్ చేసినపుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను.. ఎందుకంటే వాళ్ల వల్లే కదా నేను ఈ రోజు ఈ వైపు వచ్చాను.

సినిమా పాయింట్ ఎలా ఉండబోతుంది..?
సినిమా అంతా చెప్పేయమంటారా (నవ్వుతూ).. వారం రోజులు ఆగండి గురువుగారు.. అప్పుడు చూద్దాం కానీ.. అక్టోబర్ 18 వరకు ఓపిక పట్టండి.

మీ కెరీర్ గురించి చెప్పండి..
నా కెరీర్ 2012లో స్టార్ట్ అయింది.. జీనియస్ సినిమాకు మెయిన్ లీడ్ చేసాను.. ఆ విషయం ఇక్కడ ఎంతమందికి తెలుసో మరి నాకు తెలియదు. ఆ సినిమా అప్పుడు హీరోలను చూపించకూడదు అనే సరికి షూటింగ్ అయ్యేంతవరకు మేం బయటికి రాలేదు. ఆ తర్వాత సినిమా కష్టాలు పడ్డాను. అల్లు అరవింద్, బి గోపాల్ లాంటి వాళ్లు నా ఫస్ట్ సినిమా అప్పుడు వచ్చారు. అక్కడ్నుంచి నా జర్నీ మొదలైంది. ఏ సినిమా ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకున్నాను. రాజుగారిగది బ్లాక్ బస్టర్ అయింది.. కానీ అప్పుడు నాకు పేరు రాలేదు. అది టెక్నీషియన్స్ హిట్. ఆ తర్వాత జతకలిసే సినిమాలో లవర్ బాయ్ కారెక్టర్ చేసాను. తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజుగారిగది 3 చేసాను. మాస్ కమర్షియల్ సినిమా ఇది. డాన్స్, ఫైట్స్, యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న పాత్ర ఇది. అందుకే వెయిటింగ్ ఫర్ అక్టోబర్ 18..

మీ కారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో.. ముందు పార్ట్స్ మాదిరే భయపడుతూ ఉంటారా..?
లేదండీ.. పార్ట్ 1లో నేను అస్సలు భయపడను.. అందులో నాది ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ టైప్ ఆఫ్ కారెక్టర్. ఎప్పుడైనా మాట్లాడితే బాగున్ను అనుకుంటారు ఆడియన్స్. పార్ట్ 3 కథ గురించి ఏం చెప్పాలన్నా కూడా సినిమాతో లింక్ అయి ఉంటుంది.. సో అప్పటి వరకు ఆగండి.

నెక్ట్స్ సినిమాలు ఏంటి..?
మూడు నాలుగు కథలు ఉన్నాయి. ముందు అయితే గోదా అనే మళయాల సబ్జెక్ట్ విన్నాను. ఏడాదిన్నరగా అందరి హీరోల దగ్గర తిరిగి నా దగ్గరికి వచ్చింది. ఛోటా కే నాయుడు అన్న, ఓంకార్ గారు విని ఆ తర్వాత నాకు చెప్తానని చెప్పారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES