రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తోపాటు, లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర పాడిన ‘అందుకోవా…’ అనే ఇన్‌స్పిరేషనల్ సాంగ్ తో పాటు ‘నా కన్నులే..’ అనే లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి.
గురువారం రోజున ఈ మూవీ నుంచి ‘ఎంత అందమో..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రేయసి ప్రేమ కోసం ఆమె ఇంటి ముందు పడిగాపులు కాసే ప్రేమికుడికి బాధను ఈ పాటలో అందంగా వ్యక్తం చేశారు. ఎం. ఎబెనెజర్ పాల్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను కడలి సత్యనారాయణ రాయగా ధనుంజయ్ సీపాన పాడారు.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ‘‘మా ‘సారంగదరియా’ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ‘ఎంత అందమో’ అనే పాటను విడుదల చేశాం. ఈ మూవీలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయి. సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ ‘ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా త్వరలోనే ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.