రుద్రంగి’ చిత్రంలో మల్లేశ్ పాత్రలో ఆకట్టుకుంటున్న ఆశిష్ గాంధీ, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

110

ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా ‘రుద్రంగి’. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు, మమతా మోహన్ దాస్ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘రుద్రంగి’ సినిమా నుంచి ఆశిష్ గాంధీ నటిస్తున్న మల్లేశ్ పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. డబుల్ బ్యారెల్ గన్ తో ఫెరోషియస్ గా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.

కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో ‘రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులతో తెరకెక్కిస్తున్నారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఏఐఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు.