రాహు కథ నచ్చి నిర్మాతగా మారాను – రాహు నిర్మాత ఏ.వి.ఎస్.ఆర్ స్వామి

633

నేను సినిమాలు ఎక్కువుగా చూస్తాను..కానీ సినిమా గురించి నాకు ఏ మాత్రం తెలియదు. నాకు సుబ్బు గారు చెప్పిన కథ నచ్చి ప్రొడ్యూసర్ గా మారాను. నేను బయో టెక్నాలజీ బిజినెస్ చేస్తున్నారు. అందులో లాభాలు చూస్తున్నాను. సినిమా మాత్రం సంపాదన కోసం చేయలేదు. నాతో పాటు నా స్నేహితుల కు కథ నచ్చడం తో బాబ్జి, రాజా గారు నేను కలసి ఈ సినిమా తీశాము.

బయో టెక్నలిజీకి సంభందించిన వ్యాపారం చేసే నేను రాహు కథ నచ్చి నిర్మాతగా మారాను. ఈ కథ లో హీరోయిన్ జీవితంలో ఒక రాహువు ఉంటాడు. ఆమె కన్వర్షన్ డిజార్డర్ తో ఫైట్ చేస్తుంటుంది. ఆమె తన జీవితంలోకి వచ్చిన రాహు పై ఎలా పోరాడుతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

సినిమా తియ్యడం గొప్ప కాదు, మార్కెటింగ్ చెయ్యగలగాలి. అలాంటి వ్యక్తులే సినిమాలు తియ్యాలి, మా సినిమా నచ్చి సురేష్ బాబు గారు విడుదల చేస్తున్నారు. నా డబ్బు తిరిగి వస్తుందనే నమ్మకంతో రాహు సినిమా నిర్మించాను.

రాహు సినిమా సక్సెస్ అవుతుందని చెప్పగలను, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి, సంగీతం బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది ఇలా అన్నీ ఈ సినిమాకు కుదిరాయి. ఈ సినిమా ఫ్యామిలీ అందరూ కలసి చూడదగ్గ సినిమా అవుతుంది. డబ్బు కోసం నేను సినిమా చెయ్యను, ఆడియన్స్ కు వినోదం పంచడమే నా లక్ష్యం. సినిమాలు అనేది నా వ్యాపకం మాత్రమే, నచ్చిన కథ లు వస్తే సినిమాలు చేస్తాను. సుబ్బు గారి తో సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నాను. మేము సినిమా తీస్తే , మధురా శ్రీధర్ గారు రీలీజ్ కి సపోర్ట్ చేశారు.

హీరో, హీరోయిన్ ఇద్దరూ బాగా చేశారు. కొత్త వారు చేసిన సినిమాలాగా ఉండదు, జీ వారు మా సినిమా చూసి నచ్చి కొన్నారు, అదే మాకు ఫస్ట్ సక్సెస్, మా నమ్మకం రాహు నిలబెట్టింది. డైరెక్టర్ సుబ్బు గారు అనుకున్న సబ్జెక్ట్ అనుకున్నట్లు తీశారు, రేపు విడుదల తరువాత ప్రేక్షకులు అదే అంటారు.

మాది చీరాల సురేష్ బాబు గారితో గత కొంత కాలంనుండి పరిచయం ఉంది, అలాగే నిర్మాత మధుర శ్రీధర్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు, సినిమా అనేది గ్యారెంటీ లేని ఫీల్డ్ సక్సెస్ రేటు తక్కువ. ఫ్యామిలీతో చూసే సినిమాలు తక్కువగా వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో కుటుంబం అంతా కలిసి చూడగగ్గ సినిమా రాహు. ఫిబ్రవరి 28న విడుదల కాబోతున్న రాహు ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అవుతుంది.

న్యూ ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు. టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – సుబ్బు వేదుల
నిర్మాతలు – ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల

డిఓపి – సురేష్ రగుతు ,ఈశ్వర్ యల్లు మహాంతి,
మ్యూజిక్ – ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్ – అమర్ రెడ్డి
పి ఆర్ ఓ : జీ యస్ కే మీడియా