హలో మేడమ్‌ లోగో ఆవిష్కరణ..

1054

నవీన్‌.కె.చారి, ప్రియాన్‌స, మేఘన చౌదరి, సుమాయ, కావ్య, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా వడ్ల జనార్థన్‌ దర్శకత్వం వహించిన చిత్రం “హలో మేడమ్‌’. కార్తీక్‌ మూవీ మేకర్స్ పతాకంపై వడ్ల నాగ శారద సమర్పణలో వడ్ల గురురాజ్‌, వడ్ల కార్తీక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సాగర్‌, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ ఛైర్మెన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ సంయుక్తంగా లోగోని విడుదల చేశారు. ఈ సందర్బంగా సాగర్‌ మాట్లాడుతూ, “హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఘటికా చలం మంచి కథని అందించి, దర్శకుడు జనార్థన్‌ మంచి సినిమాని తీసి ఉంటారని నమ్ముతున్నా. సినిమా అందరికి రీచ్‌ అయి పెద్ద సక్సెస్‌ కావాలి’ అని అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, “కొత్త సినిమాలను ఆదరిస్తేనే కొత్త నిర్మాతలు ఇండస్ర్టీకి వస్తారు. ఎంతో ప్యాషన్‌తో వచ్చిన ఈ నిర్మాతలను ప్రోత్సహించాలి. థియేటర్ల సమస్య ఉందనేది వాస్తవం. సినిమాని బాగా ప్రమోట్‌ చేయాలి. థియేటర్ల విషయంలో నా వంతు సహకారం అందిస్తా. సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
టి. రామసత్యనారాయణ చెబుతూ, “తండ్రిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొడుకు సినిమా తీయడం అభినందనీయం. ఈ సినిమాతో వారు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. మంచి సినిమాలకు థియేటర్లు దొరుకుతాయి. ఇది పెద్ద హిట్‌ కావాలి’ అని చెప్పారు.
చిత్ర దర్శకుడు వడ్ల జనార్థన్‌ మాట్లాడుతూ,”ప్రస్తుత సమాజంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రం. ఘటికా చలం మంచి కథ, స్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు.
ఘటికా చలం చెబుతూ, “ఈ కథ చెప్పగానే గురురాజ్ నిర్మించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉంది. రీరికార్డింగ్‌, ఇంటర్వెల్‌ అద్భుతంగా వచ్చింది. దిశా ఘటనకు ముందే ఈ సినిమా చేశాం. ఓ సైకో అమ్మాయిలపై చేసే కిరాతకాలను తెలియజేస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రమవుతుంది. అలాగే వినోదాన్ని పంచుతుంది’ అని చెప్పారు.
సాయి వెంకట్‌ చెబుతూ,”సినిమా తీయడం ఓ ఎత్తైతే, దాన్ని విడుదల చేయడం మరో ఎత్తు. మంచి థియేటర్లలో విడుదల చేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో
పండరి గౌడ్‌,శ్రీదేవి, మేఘన, ప్రియాన్‌స, శ్రీనివాస్‌, గురురాజ్‌, సుమాయ తదితరులు పాల్గొన్నారు.
సాయి, జియో, లక్షన్‌, శీలం శ్రీను, వెంకటేష్‌ తాతిరాజు, ముప్పిడి వాసుదేవరాజు, లక్ష్మిదేవి, కాకినాడ గుప్త, వాస్తుప్రకాష్, హల్లాఫ్, జూ.బాబుమోహన్‌, మల్లాది శాస్త్రి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు,స్ర్కీన్‌ ప్లే, సంగీతః పోలూర్‌ ఘటికా చలం, కెమెరాః కె.శ్రీనివాస్‌ రెడ్డి, ఎడిటింగ్‌ః వాసు వర్మ, ప్రొడక్షన్‌ మెనేజర్‌ః శీలం శ్రీనివాసరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ః తలపనేని నరేంద్రబాబు, నిర్మాతలుః వడ్ల గురురాజ్‌, వడ్ల కార్తీక్‌, దర్శకత్వం : వడ్ల జనార్థన్‌