‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్‌ లుక్‌ డబుల్‌ ధమాకా….

586

వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి సంచలన విజయాలను సాధించే దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి అంటున్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌. సత్యదేవ్, ఇషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా ప్రముఖ కథానాయకుడు ‘శ్రీరామ్‌’, ‘పైసా వసూల్‌’ ఫేమ్‌ ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ కానూరి నిర్మాత. ‘ఢమరుకం’ శ్రీనివాస్‌ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరణ విభిన్నంగా జరిగింది. ఫస్ట్‌ లుక్‌ను, పోస్టర్‌ నంబర్‌1, పోస్టర్‌ నంబర్‌ 2 అని రెండు పోస్టర్‌లను విడుదల చేసింది చిత్రయూనిట్‌. మొదటి పోస్టర్‌ను సి.కల్యాణ్‌ విడుదల చేయగా, రెండో పోస్టర్‌ను శ్రీనివాస్‌ రెడ్డి బావ, వ్యాపారవేత్త పులివెందులకు చెందిన దంతులూరి కృష్ణ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘పోస్టర్‌ చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. దర్శకుడు శ్రీను గతంలో అనేక కామెడీ చిత్రాలను తీసి విజయం సాధించారు. ఈ సినిమాను వండర్‌ఫుల్‌ స్క్రీన్‌ప్లే »ే స్డ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని నాకు తెలుసు. ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న శ్రీనివాస్‌ కానూరికి మంచి పేరుతో పాటు లాభాలు రావాలని ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు.
దంతులూరి కృష్ణ మాట్లాడుతూ– ‘‘గతంలో మా బావ ఎంత మంచి చిత్రాలు తీశారో నాతో పాటు ప్రేక్షకులందరకీ తెలుసు. నేను ఈ సినిమా రషెస్‌ చూశాను. సత్యదేవ్, ఇషా, శ్రీరామ్‌ల నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఆర్టిస్ట్‌ల నుంచి నటన రాబట్టడం మా బావకు వెన్నతో పెట్టిన విద్య. రఘు కుంచె బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో పాటు, ‘గరుడ వేగ’ ఫేమ్‌ అంజి కెమెరావర్క్‌ సినిమాకి హైలెట్‌’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ కానూరి, రఘు కుంచె, ‘గరుడవేగ’ ఫేమ్‌ కెమెరామెన్‌ అంజి, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా తదితరులు పాల్గొన్నారు. కృష్ణభగవాన్, రవిప్రకాశ్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: కృష్ణ భగవాన్‌.