ధమ్కీ మూవీ టీజర్ బాగుంది. – వివి వినాయక్

632

శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కరరావుసమర్పణలో సుంకరబ్రదర్స్‌ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’.. రజిత్‌, త్రిషాలాషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏనుగంటి దర్శకత్వంవహించారు..రచయిత శ్రీమణి సాహిత్యంఅందిస్తున్న ఈ సినిమా కి ఎస్‌.బి ఆనంద్‌ సంగీతం, దీపక్‌ భగవంత్‌ సినిమాటోగ్రఫీఅందిస్తున్నారు.. ఈ చిత్రం టీజర్‌, బ్యానర్‌లోగోను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
వి వి వినాయక్‌ మాట్లాడుతూ – ” సుంకర బ్రదర్స్‌ మా కుటుంబానికి చాలా కావాల్సిన వారు. వాళ్ళ తమ్ముడికి మంచి లైఫ్‌ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో సుంకర బ్రదర్స్‌ ఈ బేనర్‌ని స్థాపించడం జరిగింది. ఫ్యామిలీ వాల్యూస్‌ తెలిసిన వ్యక్తిగా నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే వాళ్ళ తమ్ముడు మంచి స్థాయికి రావాలని, ఈ బ్యానర్‌ సుంకర బ్రదర్స్‌ ఎక్కడున్నా వారందరికి మంచి పేరు తీసుకొచ్చే బ్యానర్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులలోనూ మంచి అన్నదమ్ములు అంటే ఉదాహరణగా మీ ముగ్గురు ఉండాలి. అలాగే ధమ్కీ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం సుంకర బ్రదర్స్‌ బేనర్‌కి మంచి ఫౌండేషన్‌ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. ఫైట్‌ మాస్టర్‌ రామ్‌ సుంకర మాట్లాడుతూ – ”మా సుంకర బ్రదర్స్‌ ని ఆశీర్వదించడానికి వచ్చిన వివి వినాయక్‌ గారికి ధన్యవాదాలు. వినాయక్‌ చేతుల మీదుగా మా బ్యానర్‌ లాంచ్‌ అవ్వాలనేది మా ముగ్గురి అన్నదమ్ముల కోరిక. మా అమ్మానాన్నల ఆశిర్వాదంతో ముగ్గురం అన్నదమ్ములం మంచి పేరు సంపాదించాలనే సదుద్దేశంతోనే ఈ బేనర్‌ స్థాపించాం. మా బ్యానర్లో త్వరలోనే మా తమ్ముణ్ణి హీరోగా లాంచ్‌ చేయబోతున్నాం. అలాగే ఈ మూవీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ చాలా సపోర్ట్‌ చేశారు. మా బేనర్‌కి మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ – ” మా ధమ్కీ మూవీని బ్లెస్‌ చేయడానికి వచ్చిన వినాయక్‌ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులను, టెక్నీషన్స్‌ ని పరిచయం చేశాను. అందరు మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. ఇది నా రెండో సినిమా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుంకర బ్రదర్స్‌కి థాంక్స్‌” అన్నారు.
హీరో రజిత్‌ మాట్లాడుతూ – ” నన్ను బ్లెస్‌ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుంకర బ్రదర్స్‌ ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. సినిమా అవుట్‌ ఫుట్‌ చాలా బాగుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అన్నారు.
సుంకర బ్రదర్స్‌ అభిలాష్‌ మాట్లాడుతూ – ”మా సుంకర బ్రదర్స్‌ బేనర్‌లో ధమ్కీ లాంటి మంచి మంచి మూవీస్‌ రావాలని కోరుకుంటున్నాను. సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అన్నారు.

నటీనటులు : రజిత్, త్రిషాలాష, శ్రవణ్, అజయ్, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి. : దీపక్ భగవంత్
సంగీతం : ఎసి.బి ఆనంద్
ఎడిటర్ : చోట కె ప్రసాద్
లిరిక్స్ : శ్రీమణి
ఫైట్ మాస్టర్ : రామ్-లక్ష్మణ్
బ్యానర్ : సుంకర బ్రదర్స్
సమర్పణ : శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కర రావు
నిర్మాత : సత్యనారాయణ సుంకర
రచన- దర్శకత్వం : ఏనుగంటి
13 Attachments