*వైజాగ్ ఫ్యాన్స్ కేరింతల మధ్య ఘనంగా “పుష్పక విమానం” ప్రీ రిలీజ్ వేడుక*

696

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం విశాఖ గోకుల్ పార్క్ లో విజయ్, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్, స్థానిక సినీ ప్రియుల కేరింతల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా..

*మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ*…అప్పట్లో మనం జంధ్యాల గారి సినిమాలు చూసి ఎంత హాయిగా నవ్వుకునే వాళ్లమో ఈ పుష్పక విమానం సినిమా చూసి అంతే ఆనందిస్తాం. ఆనంద్ ఫెంటాస్టిక్ గా నటించాడు, హీరోయిన్స్ బాగా క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఈ సినిమాకు వాళ్ల డైలాగ్ లు, యాక్టింగ్ టైమింగ్ చాలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అవసరం లేదని అనిపించింది. డైరెక్టర్ సూపర్బ్ మూవీ చేశారు. విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే ఎప్పుడూ మాస్క్ తీయని విజయ్..వాళ్లు రాగానే దగ్గరకు తీసుకుని పలకరిస్తున్నారు. పుష్పక విమానం తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది. అన్నారు.

*నటుడు హర్ష మాట్లాడుతూ*…నేను నటుడినే కాదు రైటర్ ను కూడా. చాలా కథలు వింటుంటా. అందులే కొన్నే మంచి కథలు ఉంటాయి. పుష్పక విమానం కథ విన్నప్పుడు ఇందులో ఫన్, ఎమోషన్ రెండూ ఉన్నాయనిపించింది. ఆనంద్, హీరోయిన్స్ కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. విజయ్ తన వెంట తమ్ముడిని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. విజయ్ కు ప్రేక్షకులు, అభిమానులు ఇచ్చిన ప్రేమ ఆనంద్ కు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నాకొక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. అన్నారు.

*నిర్మాత విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ*….మాతో కలిసి విజయ్ దేవరకొండ ఈ ప్రొడక్షన్ పెట్టింది యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికే. పుష్పక విమానం ఒక్కటే కాదు, ఈ బ్యానర్ నుంచి ఇలాంటి కొత్త తరహా చిత్రాలు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. పుష్పక విమానం మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆనంద్ పర్మార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది. విజయ్ తన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా కరోనా టైమ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రజలకు కూడా హెల్ప్ చేశారు. అప్పటికి తన ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, వెనక్కి తగ్గకుండా సహాయం చేశాడు. ఇకపైనా విజయ్ తో కలిసి మా టీమ్ అంతా అవసరంలో ఉన్న వాళ్లకు తప్పకుండా హెల్ప్ చేస్తాం. అన్నారు.

*హీరోయిన్ శాన్వి మేఘన మాట్లాడుతూ*…దొరసాని చిత్రంతో ఆనంద్ మంచి పేరు, అవార్డ్స్ తెచ్చుకున్నాడు. పుష్పక విమానంతో తనను ఇష్టపడేవారి లిస్ట్ బాగా పెంచుకోబోతున్నాడు. ఈ సినిమాలో సుందర్ ను మీనాక్షి ఎందుకు వదిలేసిందో చూడాలంటే నవంబర్ 12 దాకా ఆగాల్సిందే. విజయ్ దేవరకొండ మంచి మనసున్న హీరో. పాండమిక్ టైమ్ లో ఎంతోమందికి హెల్ప్ చేశాడు. తన ప్రొడక్షన్ లో యంగ్ టాలెంట్ కు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. తను కష్టపడి ఎలా పైకి వచ్చాడో మనందరికీ తెలుసు. ఒక సపోర్ట్ కావాల్సిన వాళ్లకు ఇప్పుడు తను చేయగలుగుతున్నాడు. పుష్పక విమానంలో మీనాక్షి క్యారెక్టర్ చేసే అవకాశం రావడం గీత్ అదృష్టం. నా క్యారెక్టర్ కు కూడా మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా. అని చెప్పింది.

*హీరోయిన్ గీత్ సైని మాట్లాడుతూ*..పుష్పక విమానం చిత్రంలో మీనాక్షి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అందుకే మూడు సార్లు ఆడిషన్స్ చేసి, ఈ క్యారెక్టర్ దక్కించుకున్నా. భార్య తనను ఎందుకు వదిలి వెళ్లిందో మిగతా వారికి చెప్పుకోలేక సుందర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ట్రైలర్ లో చూశాం. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బయట నన్ను అందరూ అదే ప్రశ్న అడుగుతున్నారు ఎందుకు సుందర్ ను వదిలేశావని, ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే నవంబర్ 12న థియేటర్లకు రండి. అని అన్నారు.

*దర్శకుడు దామోదర మాట్లాడుతూ*…పుష్పక విమానం సాంకేతికంగా, ఆర్టిస్టుల పర్మార్మెన్స్ పరంగా బలమైన సినిమా. హీరో క్యారెక్టర్ ను ఎంజాయ్ చేయాలంటే మా చిత్రానికి రండి. ఆనంద్ అంత బాగా నటించాడు. ఈ చిత్రంలో టెక్నీషియన్స్, నటీనటులు కథను ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, ఇలా బాగుంటుంది అంటూ నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. పుష్పక విమానం చూశాక విజయ్ లాగే ఆనంద్ కు కూడా లేడీ ఫ్యాన్స్ పెరుగుతారు. అన్నారు.

*హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ*…నేను హీరోగా ఇవాళ మీ ముందు ఉన్నానంటే కారణం అన్నయ్య, నాన్న. అన్నయ్య విజయ్ ఎంతో కష్టపడి స్టార్ హీరో అయ్యాడు. ఆయన వేసిన దారిలో నేను ఈజీగా నడుచుకుంటూ మీ ముందుకు వచ్చాను. కానీ విజయ్ ఎప్పుడూ నాకు సొంతంగా ఎదగమనే చెబుతుంటాడు. ఆ మాట ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని నేను చేసిన చిత్రమిది. రెగ్యులర్ హీరో క్యారెక్టర్ లా ఈ చిత్రంలో నా పాత్ర ఉండదు. సహజంగా మీ చుట్టూ కనిపించే ఒక పాత్ర చిట్టిలంక సుందర్ ది. పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే అతని భార్య లేచిపోతుంది. ఎందుకు అనేది థియేటర్ లో చూడండి. ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అన్ని అంశాలు పుష్పక విమానం చిత్రంలో ఉంటాయి. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూపు దృష్టి మరల్చకుండా సినిమా చూస్తారు. పుష్పక విమానం గురించి మీరు ఎదురుచూస్తున్నారని తెలుసు. నవంబర్ 12న థియేటర్లలో కలుద్దాం. అన్నారు.

*హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ*…మీరు మా మీద చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఇవాళ ఇక్కడున్నాం. ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది చాలా కష్టం, ఒత్తిడితో కూడుకున్న విషయం. అయితే ఇవాళ స్టేజి మీద ఇంతమంది యంగ్ టాలెంట్ సంతోషంగా తమ సినిమా గురించి మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు ప్రొడక్షన్ లోని కష్టాలు పడిన పర్వాలేదు అనిపిస్తోంది. నేను ఏదైనా అనుకుంటే ఆ పనిచేసేందుకు కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తాను. మీ అభిమానం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పుష్పక విమానం ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ తీసుకొచ్చాము. సినిమా చాలా బాగుంటుంది. మీరంతా చూడండి. దర్శకుడు దామోదర చాలా టాలెెంటెడ్ టెక్నీషియన్. చాలా కాలంగా తెలుసు. మాకొక మంచి సినిమా చేసి ఇచ్చాడు. ఆనంద్ ను చిట్టిలంక సుందర్ క్యారెక్టర్ లో ముందు ఊహించలేకపోయాను. కానీ అతను పర్మార్మ్ చేసి చూపించాడు. నటించడం ఒక్కటే కాదు ప్రొడక్షన్ లో, ప్రమోషన్ లో అన్నింట్లో తాను ఇన్వాల్వ్ అయి సూపర్ సినిమా తీసుకొచ్చాడు. శాన్వీ మేఘన, గీత్ సైని లకు హీరోయిన్స్ గా మంచి పేరొస్తుంది. వాళ్లకు ఇంకా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలని ఇండస్ట్రీని కోరుతున్నా. మీ అభిమానం ఎప్పుడూ కావాలని కోరుకుంటా. మీకు మంచి సినిమాలు, కొత్త తరహా చిత్రాలు చేయాలనేది ఒక్కటే నా జీవిత ఆశయం. ఇటీవల మహబూబ్ నగర్ లో ఏవిడి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాం. నవంబర్ 11న పుష్పక విమానం ప్రీమియర్స్ వేస్తున్నాం. బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసుకోండి. ప్రీమియర్ షో లో కలుద్దాం. అన్నారు.