బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బాబీ విడుద‌ల చేసిన ముఖ్య గ‌మ‌నిక ఫ‌స్ట్ సింగిల్ ఆ క‌న్నుల చూపుల్లోనా..

173

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌జిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా ముఖ్య గ‌మ‌నిక‌. ఇటీవ‌ల అన్న‌పూర్ణ ఫోటో స్టూడియో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లావ‌ణ్య హీరోయిన్ గా న‌టిస్తోంది. ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌నిచేసిన వేణు ముర‌ళిధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు హైద‌రాబాద్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బాబీ ముఖ్య అతిధిగా హాజ‌రై ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ఆ క‌న్నుల చూపుల్లోనా.. రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా…

సంగీత ద‌ర్శ‌కుడు కిర‌ణ్ మాట్లాడుతూ – `బిజీ షెడ్యూల్‌లో కూడా వ‌చ్చి మా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేసిన బాబీ గారికి ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు. ద‌ర్శ‌కుడు వేణుగారు ఫ‌స్ట్ నుండి న‌న్ను గైడ్ చేస్తూ ఈ సినిమాకి అద్భుత‌మైన మ్యూజిక్ చేపించారు. ఇప్పుడు మొద‌టిపాట విడుద‌లైంది ఎంత‌వ‌ర‌కూ బాగుంది అనేది వారి నోటితోని వింటేనే బాగుంటుంది. నా మీద న‌మ్మ‌కం ఉంచి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌`అన్నారు.

హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ – `బాబీ గారిని 2016లో అల్లు అర్హ పాప పుట్టిన‌ప్పుడు క‌ల‌వ‌డం జ‌రిగింది. అప్పుడు ఆయ‌న నాకు `ప‌వ‌ర్‌`బాబీగా తెలుసు. ఆ త‌ర్వాత రెండు మూడు సార్లు బ‌న్నీగారి ఫంక్ష‌న్‌లో క‌లిసిన‌ప్పుడు `జైల‌వ‌కుశ ద‌ర్శ‌కుడిగా తెలుసు..రీసెంట్‌గా క‌లిసిన‌ప్పుడు 200 కోట్లు క‌లెక్ట్ చేసిన వాల్తేరు వీర‌య్య డైరెక్ట‌ర్‌గా తెలుసు..ఇలా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ వ‌చ్చారు. నేను రీసెంట్‌గా ఫోన్ చేసి అన్న‌య్య ఇలా సాంగ్ లాంచ్ అనుకుంటున్నాం మీరు రావాలి అన‌గానే ఎప్పుడు? ఎక్క‌డ ఏ టైమ్‌కి అని మాత్ర‌మే అడిగారు.. నేను పుట్టింది పెరిగింది ఇండ‌స్ట్రీలోనే..నిజంగా చెబుతున్న ఇలాంటి మంచి మ‌నిషి నిజంగా ఇండ‌స్ట్రీలో లేరు..అన్న‌య్య మీరు చాలా అరుదైన ర‌కం. 200 కోట్ల సినిమా తీసిన డైరెక్ట‌ర్‌..బాల‌య్య బాబుతో సినిమా తీస్తున్న డైరెక్ట‌ర్ నా కోసం ఆయ‌న షెడ్యూల్ మ‌ధ్య‌లోంచి వ‌చ్చారు. ఎన్ని జ‌న్మ‌లెత్తినా మీరు చేసిన స‌పోర్ట్ నిజంగా మ‌ర్చిపోలేను. మీలాంటి వారు ఎంక‌రేజ్ చేస్తేనే క్రొత్త ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు ఇండ‌స్ట్రీకి వ‌స్తారు. మ‌హేష్ బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది గాయం విలువ తెలిసినోడికే సాయం విలువ తెలుస్త‌ది అని..ఆయ‌న మాలాగే ఎలాంటి స‌పోర్ట్ లేకుండా వ‌చ్చారు కాబ‌ట్టే ఆ విలువ తెలుసు..అన్న‌య్య మీరు ఇలానే ఎంతో మందిని ఎంక‌రేజ్ చేయాలి..అలాగే మీరు వ‌స్తున్నారు అన‌గానే ఒక 200 మెసేజ్ లు వ‌చ్చాయి. ఒక‌రైనా ఆల్‌దిబెస్ట్ చెబుతార‌ని చూశా కాని.. అంద‌రూ బాల‌య్య బాబు గారి సినిమా అప్డేట్ గురించే అడిగారు.. ద‌య‌చేసి ఒక్క అప్‌డేట్ మాత్రం చెప్పండి“ అన్నారు.

ద‌ర్శ‌కుడు బాబీ మాట్లాడుతూ – `బ‌న్నీగారిని ఎప్పుడు క‌ల‌వ‌డానికి వెళ్లినా ఇన్నోసెంట్‌గా ఒక అబ్బాయి వ‌చ్చి తీసుకెళ్లి కూర్చోబెట్ట‌డం..టీ, కాఫీల గురించి అడుగుతూ ఉండేవాడు. విరాన్ అల్లు అర్జున్ గారికి బందువులు అవుతార‌ని నాకు నిజంగా తెలీదు..త‌ను ఎప్పుడూ చెప్పేవాడు కాదు. బ‌న్నీగారి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ..నేను బ‌న్నీని ఎప్పుడు క‌లిసినా త‌నే ఉండేవాడు. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత స‌డెన్ గా ఒక పోస్ట‌ర్ చూశా.. ఇందేంటి మ‌నోడిలా ఉన్నాడే అనుకున్నా..రీసెంట్‌గా క‌లిసిన‌ప్పుడు అన్న‌య్య ఇలా సినిమా తీశా..ఈవెంట్‌కి మీరు రావాలి అని అడిగాడు..అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకుని వాళ్ల స‌హాయం తీసుకోకుండా కేవ‌లం వారి ఆశీస్సులు మాత్ర‌మే తీసుకుని ఇండిపెండెంట్‌గా ప్ర‌య‌త్నిస్తున్నావంటే..ఇదే నీ స‌క్సెస్‌కి పెద్ద పిల్ల‌ర్ త‌మ్ముడు..ఎవ‌రైనా నిజంగా స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నారంటే మ‌నోడు అన్న‌ట్టు నాకు నాలానే అనిపిస్త‌ది. ఏదో ఒక విధంగా మ‌నం ప‌డ్డ క‌ష్టం ప‌దిమందికి తెలియాలి అని అనుకుంటాను అందుకే పిల‌వగానే వ‌చ్చాను. ఇక్క‌డికి వ‌చ్చాక తెలిసింది ద‌ర్శ‌కుడు వేణు రాజ‌మౌళి గారి ఎన్నో సినిమాల‌కి చీఫ్ అసోసియేట్ డీఓపిగా ప‌నిచేశార‌ని.. మీ విజ‌న్ ఖ‌చ్చితంగా ఆ స్థాయిలో ఉంటుంద‌ని ఆశిస్తున్నాను. సాంగ్ చూశాను. చాలా బాగుంది. సింగ‌ర్ న‌కాశ్ అజీజ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి `స‌ర్ధార్ గబ్బ‌ర్‌సింగ్ లో తోబ తోబ‌..`అలాగే చిరంజీవి గారి `వాల్తేరు వీర‌య్య‌`లో `బాస్ పార్టీ..`పాట‌లు పాడాడు..అంత మంచి సింగ‌ర్‌ని ఎంచుకుని మంచి సంగీతం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ని అభినందిస్తున్నాను. అలాగే విరాన్ ని న‌మ్మి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన నిర్మాత‌ల‌కి కృత‌జ్ఞ‌త‌లు..పోస్ట‌ర్ చూడ‌గానే అడిగాను కాప్ రోల్‌? అని అంత హానెస్ట్ గా హెయిర్ ట్రిమ్ చేసుకుని బాడీ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో విరాన్ కి బంగారు భ‌విష్య‌త్ ఉండాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్…బాల‌య్య బాబు గారి సినిమా గురించి న‌న్నుకూడా చాలా మంది అడుగుతున్నారు..ఒక‌టైతే ప్రామిస్ చేస్తున్నా..వేరే లెవ‌ల్ సినిమా వ‌స్తుంది.. ఆల్‌రెడీ ఊటీలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. నాకు ఫేవ‌రేట్ సినిమా `గీతాంజ‌లి అలాంటి బ్యూటిఫుల్ లొకేష‌న్‌లో వయిలెంట్ ఫిలిం ఎపిసోడ్ ఫినిష్ చేసి వ‌చ్చాను. నెక్ట్స్ షెడ్యూల్ కి రాజ‌స్థాన్ వెళుతున్నాం. 2024లో వ‌రుస అప్డేట్ లు వ‌స్తాయి“ అన్నారు.

దర్శ‌కుడు వేణు ముర‌ళీధ‌ర్ మాట్లాడుతూ – `ముఖ్య‌గ‌మ‌నిక సినిమాకి ముఖ్య అతిధిగా వ‌చ్చిన బాబీగారికి ధ‌న్య‌వాదాలు. త‌ప్పు చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చి ఆ ఆలోచ‌న‌ని సరిదిద్దుకునే లోపే కొన్ని అన‌ర్ధాలు జ‌రుగుతాయి దాన్ని బేస్ చేసుకుని చేసిన సినిమా ఇది. మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది..ఈ సినిమాకి హీరోగా విరాన్ గారు మాకు దొర‌క‌డం నిజంగా మా అదృష్టం. ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌లకి ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను“ అన్నారు.

నిర్మాత రాజ‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ – `ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వ‌చ్చిన బాబీ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. `మ‌ఖ్య గ‌మ‌నిక మా బేన‌ర్ శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ..త్వ‌ర‌లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో రెండు పాట‌లు ఉన్నాయి. రెండు అద్భుతంగా వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఇత‌ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో మ‌ళ్లీ క‌లుద్దాం“ అన్నారు.

విరాన్ ముత్తం శెట్టి, లావ‌ణ్య హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

ద‌ర్శ‌కత్వం: వేణు ముర‌ళీధ‌ర్.వి
బేన‌ర్: శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు: రాజ‌శేఖ‌ర్, సాయి కృష్ణ‌
సంగీతం: కిర‌ణ్ వెన్న‌
సింగ‌ర్స్‌: న‌కాశ్ అజీజ్, రేవ‌తి శ్రిత‌
లిరిసిస్ట్‌: కిర‌ణ్ వెన్న‌
ఎడిట‌ర్‌: శివ శార్వాణి
పీఆర్ఓ: శ్రీ‌ను – సిద్ధు