నవంబర్ 26న ‘1997’ సినిమా విడుదల

326

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్‌ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 26వ తేదీన విడుదల అవుతున్నట్టు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.