ప్రముఖ గేయ రచయిత శివశక్తి దత్త చేతుల మీదుగా ‘ప్రేమకు జై’ టీజర్ లాంచ్

74
 • ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం ‘ప్రేమకు జై’. గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో ఈ చిత్రం రూపోందింది. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సరంలో విడుదల కానుంది. తాజాగా ప్రఖ్యాత లిరిక్స్ రైటర్ శివశక్తి దత్త చేతుల మీదుగా పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.
 • ఆనంతరం శివశక్తి దత్త గారు మాట్లాడుతూ….”యంగ్ టాలెంట్ బాగా చేశారు. నూతన న‌టీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్ చాలా బాగుంది. ఈ టీజర్ చాలా బాగుంది. చిత్ర యూనిట్ శుభాకాంక్షలు” అన్నారు.
 • ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు…
 • హీరోహీరోయిన్లు: అనిల్ బురగాని, ఆర్ జ్వలిత
  దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం
  నిర్మాత: అనసూర్య
  లైన్ ప్రొడ్యూసర్: మైలారం రాజు,
  DOP: ఉరుకుందా రెడ్డి,
  మ్యూజిక్ : చైతు,
  ఎడిటర్: సామ్రాట్ జి,
  ఫైట్స్: రాబిన్ సుబ్బు డైనమిక్ మధు
  పబ్లిసీటీ డిజైనర్ : వివారెడ్డి
  కొరియోగ్రాఫర్ :బాలు
  పి.ఆర్.ఓ: దయ్యాల అశోక్