అక్టోబర్ 7న ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన..

234

ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 25వ సినిమా గురించి ప్రకటన వచ్చేసింది. సోషియో ఫాంటసీ నుంచి యాక్షన్ ఎంటర్‌టైనర్స్ వరకు.. రొమాంటిక్ కామెడీస్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు.. అన్ని జోనర్స్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. అందుకే ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. కొత్త కొత్త రచయితలకు అవకాశాలు ఇస్తూ.. తన ఇమేజ్ మరింత పెంచుకుంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈయనకు ఫ్యాన్ బేస్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్ 25వ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. కచ్చితంగా గతంలో ఆయన ఎప్పుడూ చేయనంత కొత్తగా.. సరికొత్త జోనర్‌లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు తనను ఎవరూ చూడనంత కొత్తగా తన 25వ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు ప్రభాస్. ఈ సినిమా కోసం ఓ క్రేజీ దర్శకుడు పని చేయబోతున్నారు. ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్‌కు ఎలాంటి పాత్ర చేసినా కూడా అభిమానులు ఒప్పుకుంటారు. యాక్షన్ రోల్ చేస్తే అంతకంటే పండగ మరోటి ఉండదు.. సేఫ్ కూడా. అయినా సరే.. 25వ సినిమాను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. కచ్చితంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మరో స్థాయిలో ఉంటుందని.. ఆయన నటన మరే సినిమాలో చూడనంత స్థాయిలో ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు. 2021 అక్టోబర్ 7న ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.