మంచి కంటెంట్ తో వచ్చే చిన్న పిల్లల సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు…పాన్ ఇండియా సినిమా “లిల్లీ’ ట్రైలర్ వేడుకలో నిర్మాత దిల్ రాజు

202

 

గోపురం స్టూడియోస్‌ పతాకంపై నేహా ముఖ్యప్రాతలో వేదాంత్‌ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్‌వీర్‌ ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శివమ్‌ ను దర్శకునిగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌లు నిర్మించిన చిత్రం “లిల్లీ” .ఈ చిత్ర ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లిల్లీ’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

అనంతరం గెస్ట్ గా వచ్చిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…RRR సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా తెలుగు సినిమా , ఇండియన్ సినిమాకు మంచి పేరు తీసుకు రావడమే కాకుండా ఆస్కార్ ఆవార్డ్ వచ్చేలా తీసిన టీం అందరికీ మా ధన్యవాదములు. నా చైల్డ్ వుడ్ లో శివ కృష్ణ గారి సినిమాలు ఆడపడుచు, అనాదిగా ఆడది లాంటి ఫ్యామిలీ ఎమోషన్, ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న సినిమాలు విపరీతంగా నచ్చేవి.నాకు ఎమోషన్ కలిగినప్పుడల్లా అనాదిగా ఆడదిలో ఉండే ఊరుకో వదినమ్మ అనే సాంగ్ ను హమ్ చేస్తుంటాను. తను నాకు .నాకు చైల్డ్ వుడ్ లో గుర్తుండిపోయారు. అలాంటి మీరు ఈ సినిమా టైలర్ లాంచ్ కు పిలవగానే రావడం జరిగింది. ఇలాంటి చిన్న పిల్లలు సినిమాలు తియ్యాలని ఎంకరేజ్ చేస్తున్న శివ కృష్ణ అన్న గారికి ధన్యవాదాలు. చిన్న సినిమా లకు అంటే నాకు చాలా ఇష్టం. లిటిల్ సోల్జర్స్, అంజలి సినిమాలు చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సిసింద్రీ సినిమా ను నైజాం లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో చిల్డ్రన్స్ మీద సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే పిల్లలందరూ చాలా బాగా చేశారు. వాళ్లతో సినిమా చేయాలని ఆలోచన వచ్చిన నిర్మాతలు, దర్శకులు శివమ్ గార్లకు ఆల్ ద బెస్ట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

చిత్ర నిర్మాతలు కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌ లు మాట్లాడుతూ…మేము తీస్తున్న తొలి చిత్రం “లిల్లీ”.ఈ సినిమాతో పాటు తమిళ్ లో కూడా రంగోలి సినిమా చేస్తున్నాము..అక్కడ కూడా దిల్ రాజు కు మంచి పేరు ఉంది. ఇలాగే వారు అన్ని భాషల్లో మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను.ఈ రోజు తను వచ్చి మా “లిల్లీ” సినిమా ట్రైలర్ ను విడుదల చేసినందుకు వారికి మా ధన్యవాదములు..దర్శకుడు శివమ్ చిన్న పిల్లలపై సినిమా చేద్దాం అని ఈ కథ చెప్పడం జరిగింది. కథ నచ్చడంతో తనను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఈ సినిమా తీశాము. ఈ సినిమా కొరకు సీనియర్ నటులు శివకృష్ణ గారు చాలా మంచి సపోర్ట్ చేశారు వారికీ మా ధన్యవాదాలు. ఇందులో నటించిన వారందరూ చిన్న పిల్లలు కాదు రేపటి స్టార్స్.వారంతా చక్కగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ప్రముఖ నటుడు శివకృష్ణ మాట్లాడుతూ‘..RRR ద్వారా తెలుగు ఇండస్ట్రీ కు ఆస్కార్ అవార్డు తో ఎంతో మంచి పేరు తీసుకు వచ్చిన రాజమౌళి టీమ్ కు.ఎన్నో సినిమాలు తీసి ఎంతో మందికి అండగా నిలబడుతున్న దిల్ రాజు గారికి ధన్యవాదములు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అత్యధిక సినిమాలు ఒకే సంస్థలో పనిచేసిన రామానాయుడుకు ఆయన దైవంతో గురువుతో సమానం ఈ 44 సంవత్సరాలలో అలాంటి ప్రొడ్యూసర్ ని చూడలేదు.24 గంటలు సినిమా తప్ప వేరే ఆలోచన చెయ్యనటు వంటి వ్యక్తి తను ఆయనే నాకు మార్గదర్శకులు. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు దిల్ రాజు. ఎన్నో సినిమాలు చూస్తూ ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడమే కాకుండా కొన్ని వందల మందికి అన్నం పెడుతున్న దిల్ రాజుకు థాంక్స్ చెప్పాలి.తను కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడి బ్రహ్మోత్సవాల్లో బిజీగా ఉన్నా కూడా వచ్చి తన గోల్డెన్ హ్యాండ్ తో మా “లిల్లీ” చిత్ర ట్రైలర్ ను లాంఛ్ చేశారు.ఈ సినిమాలో నా మనువడు వేదాంత్ వర్మకూడా ఎంతో చక్కగా నటించారు.తనతో పాటు నేహ, దివ్య లు చాలా బాగా నటించారు.ఈ ముగ్గురు ‘లిలీ’్ల వంటి మంచి చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు ఆనందంగా ఉంది.పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ లిల్లీ చిత్రం బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.

చిత్ర దర్శకుడు శివమ్‌ మాట్లాడుతూ..మన తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి గారికి,టీంకు ధన్యవాదములు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము సినిమాలు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తాము.నేను ఇండస్ట్రీ కి వచ్చి 13 సంవత్సరాలు అయ్యింది. వచ్చిన ప్రతి దర్శకుడు కూడా దిల్ రాజు గారి బ్యానర్ లో పని చెయ్యాలి అనే డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే తన సినిమాల ద్వారా ఎంతోమంది రైటర్స్, దర్శకులకు, కార్మికులకు ఒక బలం బలగంగా మారిన దిల్ రాజు గారు వచ్చి మా సినిమా ట్రైలర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా లిల్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా కంట తడి పెట్టకుండా బయటికి పోరు.కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా తమ పిల్లలకు మా సినిమా చూయించాలని కోరుతూ చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నాకు సపోర్ట్ గా నిలిచిన శివ కృష్ణ సర్ నా ధన్యవాదాలు అన్నారు.

బాల నటులు వేదాంత్ వర్మ , నేహా, ప్రణితారెడ్డి లు మాట్లాడుతూ.. మా లిల్లీ సినిమాను అందరూ కచ్చితంగా చూసి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

లిరిసిస్ట్ లు తిరుపతి, అలరాజు లు మాట్లాడుతూ లవ్,,మీద అమ్మ మీద పాటలు రాయచ్చు కానీ చిన్న పిల్లలు మీద పాటలు రాయడం అనేది కత్తి మీద సాము లాంటింది. ఇందులో మేము రాసిన పాటలన్నీ కూడా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతాయని అన్నారు.

ముఖ్యపాత్రలో నటించిన రాజ్‌వీర్‌ మాట్లాడుతూ– ‘‘నా మొదటిచిత్రం ఇలాంటి టీమ్‌తో పనిచేయటం, సినిమాలోని పిల్లలతో కలిసి ముఖ్యపాత్రలో నటించటం మంచి అనుభూతి.  ఒక నటునిగా చక్కని ప్రారంభం అనుకుంటున్నా’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల నటుడు చెర్రీ, చిత్ర యూనిట్ తదితరులు అందరూ ట్రైలర్ చాలా బాగుంది.ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.

నటీ నటులు
నేహ, వేదాంత్‌ వర్మ, ప్రణితారెడ్డి, రాజ్‌వీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : గోపురం స్టూడియోస్‌
నిర్మాతలు :కె.బాబు రెడ్డి, జి. సతీష్ కుమార్
కెమెరా– యస్‌. రాజ్‌కుమార్,
సంగీతం– ఆంటో ఫ్రాన్సిస్,
ఎడిటర్‌– లోకేశ్‌ కడలి,
ఫైనల్‌మిక్సింగ్‌– సినోయ్‌ జోసెఫ్,
సౌండ్‌– జుబిన్‌ రాజ్,
వీఎఫ్‌ఎక్స్‌– ఆర్క్‌ వర్క్స్‌.
లిరిక్స్ : తిరుపతి, అలరాజు
ఫోన్. ఆర్. ఓ : శివ మల్లాల