తెలుగు పాట ‘నాటు నాటు’ కి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం: ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం

143

95వ అకాడమీ (Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచ‌లం. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అకాడమీ అవార్డ్ దేశానికే గర్వకారణమని అన్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్ & కాలభైరవ, పాట రచయిత చంద్రబోస్, నృత్య దర్శకుడు ప్రేమరక్షిత్ మరియు చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.