అక్టోబర్ 8 న *యు.ఎఫ్. ఓ మూవీస్ విడుదల వుతున్న”నేను లేని నా ప్రేమ కథ” సాంగ్స్ , ట్రైలర్ లాంచ్

393

లక్ష్మీ కందుకూరి సమర్పించు సరస్వతి క్రియేషన్స్ ,త్రిషాల ఏంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నవీన్ చంద్ర క్రిష్ సిద్ది పల్లి, గాయత్రి ఆర్ సురేష్, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర నటీనటులుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, డాక్టర్ భాస్కర్ రావ్ అన్నదాత లు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “నేను లేని నా ప్రేమకథ” అక్టోబర్ 8న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రం ట్రైలర్ మరియు పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల, కొరియోగ్రాఫర్ స్వర్ణ బాబు. బి.యన్ ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనా షా, యు.ఎఫ్. ఓ మూవీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గుంటూరు లక్ష్మణ్ లు చిత్రం లోని పాటలను విడుదల చేయగా డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ …ఒక చిన్న సినిమాను సపోర్ట్ చేస్తున్న వి యఫ్ ఓ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. నేను సినిమా చూశాను కొత్త కంటెంట్ తో తీసిన సినిమా నాకు బాగా నచ్చింది.లక్ష్మణ్ గారు ఇకముందు ఇలాంటి మంచి సినిమాలను విడుదల చేయాలని మనవి చేసుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ..” నేను లేని నా ప్రేమ కథ అనేది చాలా గొప్ప టైటిల్. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి ఎప్పుడైనా సరే ప్రేమలో పడటం అంటే మనం మరణించి మనం ప్తెమించిన వ్యక్తి గా మళ్లీ పుట్టడం. ఇలాంటి మంచి చిత్రాలను విడుదల చేస్తామని లక్ష్మణ్ గారు ముందుకు వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు .ఈ నెల 8న వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు

చిత్ర నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ … మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా విడుదల కోసం మేము రెండు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాము మేము థియేటర్లోనే విడుదల చేయాలని ఇంత వరకు ఆగాము .మాది చిన్న టీం అయినా కూడా చాలా కష్టపడి వర్క్ చేశాము. లిమిటెడ్ బడ్జెట్ లో హై క్వాలిటీతో చేసిన ఈ సినిమా బాగా వచ్చింది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న సినిమా ఇది ఫీల్ గుడ్ లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు ఈ నెల 8న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మా టీం ను ఆశీర్వదించాలని మనవి చేసుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు సురేష్ ఉత్తరాది మాట్లాడుతూ.. ఇది ప్రేమ వేదం, ఇది ప్రేమ నాదం ,ఇది ప్రేమ మంత్రం ,నిత్యం ప్రేమను జపిస్తూనే ఉంటాం ఏ తరాలు మారినా ప్రేమ అజరామరంగా ఉంటుంది . ప్రేమకథలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ రెండక్షరాల ప్రేమను కోటాక్షరాలు కూడా తెలుపలేవు అంటారు. అటువంటి ప్రేమకథను మా టీం సపోర్టుతో కళ్యాణ్ గారికి కథ చెప్పడం జరిగింది.చిత్ర నిర్మాతలకు మేము చెప్పిన కథ చెప్పడంతో మా డ్రీమ్ ను నిర్మాతలు ఫుల్ ఫిల్ చేశారు. ఇంత అందమైన ప్రేమకథను జనాల ముందుకు తీసుకెళ్లడం అనేది పెద్ద సముద్రం మీద బ్రిడ్జ్ కట్టడం లాంటిది. సముద్రం మీద బ్రిడ్జి కట్టలేము అన్నది ఎంత వాస్తవమో అటువంటి టఫ్ సిచువేషన్ లో నిర్మాతలు, లక్ష్మణ్ గారు, బి.యన్.ఐ టీం మా వెనక వెనక ఉండి చాలా సమయాల్లో హెల్ప్ చేస్తూ మాకు సపోర్ట్ గా నిలిచారు. హీరోయిన్ను చాలా చక్కగా నటించింది నటీనటులందరూ చాలా డెడికేటెడ్ గా ఫర్ చేశారు . ఈ నెల 8న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు

బి.యన్.ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజన షా మాట్లాడుతూ .. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాము. రెగ్యులర్ గా వస్తున్న లవ్ స్టొరీ కాదు.డీఫ్రెంట్ గా వస్తున్న ఈ లవ్ స్టొరీ ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

యు.ఎఫ్. ఓ మూవీస్ లక్ష్మణ్ మాట్లాడుతూ. సంవత్సరం క్రితం ఈ సినిమా పాటలు వీరితో కలసి క్యాజువల్ గా విన్నాను. ఈ సాంగ్స్ ఇంట్రెస్ట్ గా అనిపించడంతో సినిమా చూయించమని చెప్పి మూవీ చూడడం జరిగింది.సినిమా నచ్చడంతో ఎలాగైనా మాకున్న నెట్వర్క్ తో ఈ సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాను.పెద్ద సినిమాలకు ఎవరో ఒకరు తోడుగా ఉంటారు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ఎవరూ సపోర్ట్ ఉండరని మేము ఈ సినిమాకు సపోర్ట్ ఉండాలని ముందుకు వచ్చాము.మాలాంటి వాళ్ల సపోర్ట్ చేస్తే ఈ సినిమా థియేటర్స్ కెళ్లి జనాలకు రీచ్ అయ్యి అవుతుంది. ఇందులో హీరోయిన్ చేసిన రాధా క్యారెక్టర్ చూసినవాళ్ళు వన్ వీక్ వరకు క్యారీ చేస్తారు. అంత బాగా ఉంటుంది. ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకొన్న తరువాత చిత్ర యూనిట్ చేసే ప్రతి అప్డేట్ తెలుసుకుంటూ వీరి కష్టాన్ని గమనించాము..మంచి కంటెంట్ తో అక్టోబర్ 8న వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

నటుడు క్రిష్ మాట్లాడుతూ .. 2019లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. 2020 ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూశాము రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో కరుణ వచ్చింది అప్పటి నుంచి గత సంవత్సరం నుంచి టీం తోడుగా ఉంటూ మాకు సపోర్ట్ గా నిలిచారు వీరందరూ దర్శకుడు సురేష్ గారికి బ్యాక్ బోన్ గా నిలిచారు మా సినిమాకు మంచి టెక్నీషియన్స్ ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము .ఈ సినిమాలో పాటలు అన్నీ చాలా బాగున్నాయి .జువీన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడు కరుణ టైంలో మా సినిమాకు ఓటిటి లో విడుదల చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి అయినా కూడా మన నిర్మాతలు థియేటర్స్లో విడుదల చేస్తే జనాలకు రీచ్ అవుతుందని వెయిట్ చేసి ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

చిత్ర హీరోయిన్ మాట్లాడుతూ.. నవీన్ చంద్ర లాంటి సీనియర్ ఆర్టిస్ట్ తో వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.నా కెరీర్ లొనే గుర్తుండిపోయే రాధ పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రసంగించారు.

నటీనటులు
నవీన్ చంద్ర క్రిష్ సిద్ది పల్లి, గాయత్రి ఆర్ సురేష్, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్స్ : కళ్యాణ్ కందుకూరి, డాక్టర్ భాస్కరరావు అన్నదాత
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ : సురేష్ ఉత్తరాది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ ప్రతాపరెడ్డి
కో ప్రొడ్యూసర్స్ : గూడూరు వెంకట్ ,గూడూరు ప్రసాద్
డి ఓ పి : ఎస్ కె ఎస్ కె భూపతి
ఎడిటర్ : ప్రవీన్ పూడి
మ్యూజిక్ : జువీన్ సింగ్
డైలాగ్స్ : సబీర్ షా
లిరిక్స్ :-రాంబాబు గోశాల
విఆర్వో : వంశీ శేఖర్
కాస్టింగ్ డైరెక్టర్ : సూర్యకళ
Pro: Vamsi – Shekar