లవ్ & క్రైమ్ థ్రిల్లర్  “ఆధారం” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

388

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని మొదటి సారి హీరోగా కేటుగాడు సినిమా కి పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు గారి వారసురాలు చిరంజీవి సితార వల్లూరిపల్లి పజెంట్స్ లో  శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ(నూతన పరిచయం) ,నిరోషా (ప్రముఖ మోడల్ బెంగళూరు) హీరో హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం  “ఆధారం”.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు  చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ. .ఈ చిత్ర దర్శక,నిర్మాత గోపి గారు ఎప్పుడు మా సినిమాలను ఆదరిస్తుంటాడు. అందుకే ఇప్పుడు తను తీస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు పిలవగానే వచ్చాను. గోపి గారు కొత్త కథలతో కొత్త టాలెంట్ ని బయటకు తీసుకురావాలని ఎప్పటినుంచో నాతో అనేవాడు. ఆ క్రమంలోనే ఈ “ఆధారం” సినిమాలో కూడా కొత్త నటీ నటులతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.లవ్ ఎమోషన్,థ్రిల్లర్ గా వస్తున్న ఈ “ఆధారం” సినిమా తనకు మంచి పేరు తీసుకురావాలి. ఈ సినిమా పాటలు చాలా బాగా ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించి గోపి గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ .. ఇక్కడకు వచ్చి మా  ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. వారి సినిమాలు నేను ఎప్పటి నుంచో చూస్తూ వారిలాగే  చేయాలని నేను ఫాలో అవుతుంటాను. మరుగున పడిన మంచి టాలెంట్ ని బయటికి తీసుకు రావాలనే తపనతో కొత్త నటీ నటులతో ఈ సినిమా చేస్తున్నాను ఈ సినిమా మొత్తం క్రైమ్ థ్రిల్లర్  స్టోరీ మీద ముందుకెళ్తుంది స్టోరీని చెడగొట్ట కూడదని సిచువేషన్ తగ్గట్టు సాంగ్స్ పెట్టాము. ఇందులో రెండు పాటలు మాత్రమే ఉన్నాయి ఆ రెండు పాటలు చాలా బాగా వచ్చాయి ,అంబట్ల రవి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ మాట్లాడుతూ ..ఇది నా మొదటి సినిమా ఇందులో రెండు పాటలు ఉన్నాయి .రెండు పాటలు కూడా చాలా బాగా వచ్చాయి.సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశ మిచ్చిన నిర్మాతకు నా ధన్యవాదాలు అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ.. స్టొరీ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రొడ్యూసర్ అన్ని ఆయనే అయ్యి  సినిమాకి ఆయన మా అందరికీ  ఆధారం అయ్యారు. ఈ సినిమాలో నాకు లీడ్ రోల్ ఇచ్చినందుకు గోపి గారికి నా ధన్యవాదాలు.నజీర్ గారు ఇచ్చిన రెండు పాటలు చాలా బాగా ఉన్నాయి.సినిమా బాగా వచ్చింది.ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆధారం సినిమా ద్వారా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

హీరోయిన్ రేణు శ్రీ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గోపి గారికీ నా ధన్యవాదాలు. ఈ టీం తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గోపి గారితో మళ్లీ చేయాలనే విదంగా మా టీం ను చూసుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ద్వారా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు

నటీనటులు
సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ, నితీష్, చరణ్, వాసు, యోగి కత్రి, వీరభద్రం, వెంకటేశ్వర రావు, వైజాగ్ సత్యనారాయణ తదితరులు

సాంకేతిక నిపుణులు
పజెంట్స్ : సితార వల్లూరిపల్లి
బ్యానర్ : శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్
స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ : గోపి పోలవరపు
డిఒపీ : వెంకట్
మ్యూజిక్ : యస్.యన్.నజీర్
ఎడిటర్ : మేనగ శ్రీను
లిరిక్స్ : అంబట్ల రవి
ఫైట్స్ : యాక్షన్ రవి
కొరియోగ్రాఫర్ : రజని
పి.ఆర్.ఓ : గోపి పెరబోయిన