*మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ !!!*

672

సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మోస్ట్ డిసిరబుల్ టైటిల్ ను దక్కించుకున్నారు. “హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిసిరబుల్ మెన్ 2019” లిస్ట్ లో విజయ్ దేవరకొండ కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం విశేషం.2017 సం లో నెంబర్ 2 ప్లేస్ దక్కించుకున్న ఈ రౌడీ స్టార్ 2018 లో కూడా నెంబర్ 1 ప్లేస్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 2019 లో అదే స్థానం నిలబెట్టుకున్నారు.2020 లో కూడా తానే నెంబర్ 1 నిలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు.విజయ్ యాటిట్యూడ్, డ్రెస్సింగ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో చేరేలా దోహదపడ్డాయి. తక్కువ సమయంలో యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ కెరీర్ మొదట్లోనే హ్యాట్రిక్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. రొటీన్ కు భిన్నంగా స్క్రిప్ట్స్ ను ఎంపిక చేసుకోవడం, చేసే వర్క్ కాన్ఫిడెన్స్ గా పూర్తి చేయడం వంటివి తన సక్సెస్ కు సీక్రెట్స్ గా విజయ్ దేవరకొండ భావిస్తాడు. ఫ్యాషన్ విషయానికి వస్తే తన ఆలోచనే తాను వేసుకునే డ్రెస్ సెన్స్ ను డిసైడ్ చేస్తుందని అదే ఫ్యాషన్ అంటున్నాడు విజయ్ దేవరకొండ.